ఆస్పత్రిలో అవినీతి పట్టదా..? | hospital corruption not find it | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో అవినీతి పట్టదా..?

Published Wed, Jul 27 2016 9:21 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఆస్పత్రిలో అవినీతి పట్టదా..? - Sakshi

ఆస్పత్రిలో అవినీతి పట్టదా..?

నువ్వు రావు.. వీళ్లు పని చేయరు..
సూపరిటెండెంట్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
ఇకపై ప్రజాప్రతినిధులను ప్రతి నెలా కలుస్తాం : ఆస్పత్రి సూపరింటెండెంట్‌ యాదగిరి

వికారాబాద్‌ రూరల్‌ : ‘ఆస్పత్రిలో అవినీతి పేరుక పోయింది.. ఎన్ని సార్లు చెప్పినా ఇక్కడి వైద్యులు, సిబ్బందిలో మార్పు రావడం లేదన్నారు. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించా.. ఇప్పటి నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు’ అని స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ యాదగిరిపై ఎమ్మెల్యే సంజీవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పత్రి సలహాసంఘం ఏర్పడి రెండేళ్ల తరువాత మొట్ట మొదటి సారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చి రోగులను హైదరాబాద్‌కు రెఫర్‌ చేస్తున్నట్లు తన దృష్టి వచ్చిందని ఇది సరికాదని తెలిపారు. ఆస్పత్రికి  రోగులు ఎప్పుడు వచ్చినా.. డాక్టర్‌, నర్సులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక్కడి నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లిన వారిని తిరిగి ఇక్కడికి పిలిపించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు వడ్డించిన రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు. అందులో సంతకాలు పెట్టకుండా ఉన్నవారిని నిలదీశారు. అయితే అది నిన్నటి మెనూ రిజిస్టర్‌గా గుర్తించి నిర్వాహకులుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు భోజనం వడ్డించే కాంట్రాక్టర్‌ను యాదయ్యతో మాట్లాడారు. రోజుకు ఎంత మందికి భోజనం వడ్డిస్తారు? ఒక్కొరికి ఎంత ఖర్చు చేస్తారని అడిగడంతో.. రోజు గుడ్డు, మటన్‌, చికెన్‌ పెడుతామని సమాధానం ఇచ్చాడు. రోజూ ఇవన్నీ పెడుతావా అని మళ్లీ ప్రశ్నించారు. దీంతో సూపరిటెండెంట్‌ కలుగచేసుకుని మామూలు రోగులకు రోజుకు రూ. 38, గర్భిణులకు రూ. 100 ఖర్చు చేసి భోజనం వడ్డించడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆస్పత్రి నిర్వహణ సరిగా లేదని మండి పడ్డారు.
సార్‌ ఇప్పటి నుంచి ప్రతినెలా ప్రజాప్రతినిధులను కలుస్తాం?
ఇదిలా ఉంటే ప్రజా ప్రతినిధులు డాక్టర్లను ప్రతివిషయంలోనూ తప్పు పడుతుండగా ఒక్కసారిగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌.. ‘సార్‌ ఇప్పటి నుంచి ప్రతి నెలా ప్రజాప్రతినిధులను కలుస్తామని’ చెప్పారు. అయితే ఈ మాటకు ఆంతర్యం ఏమిటన్న విషయం అంతపట్టలేదు. కార్యక్రమంలో సీఎస్‌హెచ్‌ఎస్‌ హన్మంత్‌రావు, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ ముత్తార్‌ షరీఫ్‌, సలహా సంఘం సభ్యులు విజేందర్‌గౌడ్‌,  నారాయణగౌడ్‌, కౌన్సిలర్ శేషగిరి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ యాదగిరి, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement