వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
Published Sun, Jan 29 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
– ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అర్బన్): వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిజంలో మహిళల ప్రాతినిధ్యం కూడా పెరగాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ.. వేతన సంఘం సిఫారసులను అమలు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మహాసభల్లో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. గోరంట్లప్ప, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మౌలాలి, మధు సూధన్‌రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement