'జగన్‌తోనే ఉంటా'
మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. కొన్ని చానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని, తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఉద్ఘాటించారు.