
నేనెవర్నీ కొనడంలేదు: సీఎం చంద్రబాబు
టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
విజయవాడ (లబ్బీపేట): ‘నేను ఎవరినీ డబ్బులిచ్చి కొనడం లేదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు.. నాకు ఏ బలహీనతలు లేవు..’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.