ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి | identify as a government teachers | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Published Wed, Sep 21 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

నిరసన వ్యక్తం చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులు

నిరసన వ్యక్తం చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులు

జగదేవ్‌పూర్‌: కేజీబీవీ ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,  వేతనాలు పెంచాలని కొరుతూ బుధవారం మండలంలోని కేజీబీవీ ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో ఉన్నవిధంగా ఆకస్మికంగా సెలవులు 20 నుండి 27 వరకు పెంచాలని కోరారు.

వేతనంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉచిత వైద్యం, హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. వేసవి సెలవులకు కూడా వేతనం చెల్లించాలని, స్పెషల్‌ ఆఫీసర్లను, ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ శారద, ఉపాధ్యాయులు స్వప్న, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement