డిండి ఎత్తిపోతల పూర్తయితే సస్యశ్యాలమం
కొండమల్లేపల్లి :
డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి నుండి శివన్నగూడెం వరకు 5 రిజర్వాయర్లు, ఓపెన్ కెనాల్ మొత్తం 7 ప్యాకేజీలుగా సుమారు రూ. 3640 కోట్లతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. 2018 జూన్ నాటికి డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తిలో చెరువులు, కుంటలు నింపడానికి వీలుంటుందన్నారు. సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నల్లగాసు జాన్‌యాదవ్, శిరందాసు కృష్ణయ్య, వడ్త్య దేవేందర్, నాగవరం ప్రభాకర్‌రావు, చింతపల్లి పుల్లయ్య తదితరులున్నారు.
కాన్వాయ్ వదిలి కాలినడకన
25డివికె504 : రమావత్‌తండా నుండి కాలి నడకన వస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు
కొండమల్లేపల్లి :
కాన్వాయ్ వదిలి... కాలి బాట పట్టారు.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్. సోమవారం దేవరకొండ మండల పరిధిలోని రమావత్ తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. తండాకు రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు రెండు కిలో మీటర్లు నడిచి వెళ్లారు.