గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఐజీ సంజయ్ శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు.
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఐజీ సంజయ్ శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. మఫ్టీలో వచ్చిన ఆయన స్టేషన్ పరిసరాల్లో ఉన్న బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పోలీసుల పని తీరు ఎలా ఉందంటూ విచారించారు. ఇంత జరుగుతున్నా వచ్చింది ఐజీ అని అక్కడున్న పోలీసులు పసిగట్టలేకపోయారు.
ఆలస్యంగా ఎస్‌ఐ రమేష్‌బాబు ఐజీని గుర్తించి సర్ అనే సరికి అక్కడున్న సీఐ శ్రీధర్‌రెడ్డి, మరో ఎస్‌ఐ మహమ్మద్ రఫీతోపాటూ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఐజీ స్టేషన్ అంతా కలియతిరిగారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు.