IG Sanjay
-
పోలీసుల్లో జవాబుదారీతనం పెరగాలి
గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ సత్తెనపల్లి: పోలీసుల్లో జవాబుదారీతనం పెరగాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ అభిప్రాయపడ్డారు. సోమవారం సత్తెనపల్లి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల్లో ఉన్న పాత వాహనాలను క్లియర్ చేస్తున్నామన్నారు. ఆగస్టు 28న డీజీపీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా తెలియజేశారని సౌత్ కోస్టల్ పరిధిలో 2610 వాహనాలను క్లియర్ చేశామన్నారు. వాహనాల క్లియరెన్సులో సత్తెనపల్లి సబ్ డివిజన్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఆత్మకూరు, తెనాలి ద్వితీయ స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. 45 రోజుల్లో సత్తెనపల్లి సబ్ డివిజన్లో 283 వాహనాలు క్లియర్ చేశారని 57 వాహనాలు వివిధ కేసుల పరంగా ఉన్నాయన్నారు. వాటన్నీంటికి క్యూ ఆర్ కోడ్ నిక్షిప్తం చేస్తున్నామన్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ వలన ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వాటి వివరాలు ఇట్టే తెలిసిపోతాయన్నారు. క్యూ ఆర్ కోడ్‌పై వర్కు షాపులు నిర్వహిస్తున్నామన్నారు. స్టికర్ లేని వాహనాలు ఇకపై పోలీస్ స్టేషన్లో ఉండవన్నారు. సౌత్ జోనల్ కోస్టల్ పరిధిలో యుద్ద ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. పోలీస్ విభాగం చేస్తున్న పనులకు S సహకరించిన జ్యూడిషియల్, మండల మేజిస్ట్రేట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సిబ్బంది పనితీరు వేగవంతంగా ఉంటుందన్నారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించు కోవాల్సి ఉందన్నారు. టెక్నాలజీ వ్యక్తులు వచ్చి చేప్పేదానికంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలన్నారు. -
రొట్టెల పండుగకు భారీ భద్రత
–2,100మందితో బందోబస్తు డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రత్యేక పోలీసు సేవాదళ్ ఏర్పాటు గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బారాషాహీద్ దర్గా ఆవరణలో ఈనెల 12 నుంచి జరగనున్న రొట్టెల పండుగకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నట్లు గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లు , కమాండ్కంట్రోల్రూమ్, నూతనంగా నిర్మించిన ఘాట్లను పరిశీలించారు. అనంతరం పండుగ సందర్భగా పోలీసుశాఖ తీసుకొంటున్న భద్రతా ఏర్పాట్లను విలేకరులకు వెల్లడించారు. మతసామరస్యానికి రొట్టెల పండుగ ప్రతీక అన్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పండుగలో పాల్గొంటున్నారన్నారు. ఈనెల 12 నుంచి 16వరకు పండుగ జరగనుందన్నారు. గతేడాది 5లక్షల మంది దర్గాను దర్శించారనీ, ఈఏడాది 10లక్షల మందికి పైగా భక్తులు పండగుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా జిల్లా పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు దర్గాను సందర్శించేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోన్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది 24గంటలు పనిచేస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గినా నేరుగా కంట్రోల్‌రూమ్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఏసిసుబ్బారెడ్డిస్టేడియం, టిబి హాస్పిటల్, కస్తూరిదేవి గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2,100మందిదో బందోబస్తు... పండుగలో భక్తులు ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తోన్నామన్నారు. జిల్లా పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొనున్నారని చెప్పారు. ఇద్దరు ఎఎస్పీలు, 13మంది డిఎస్పీలు, 41మంది సిఐలు,113మంది ఎస్ఐలతో పాటు 1698మంద పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన 100మంది సెక్యూరిటీగార్డులు, 100మంది ఎన్సిసి క్యాడెట్లు 24గంటలు షిఫ్టుల వారిగా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. దొంగలు విజృంభించే అవకాశం ఉన్న దృష్ట్యా మఫ్టీలో క్రైం సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక పోలీసు సేవాదళ్ వికలాంగులు, వృద్దుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూలేని విధంగా 33మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదరు సిబ్బంది ప్రత్యేక దుస్తుల్లో ఉంటూ దర్గాకు వచ్చే వికలాంగులు, వృద్దులు తదితరులను దగ్గరుండి దర్గాను సందర్శించుకొనేలా చర్యలు చేపట్టామన్నారు. ఇది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డ్రోన్, సీసీకెమెరాల పర్యవేక్షణ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దర్గా ఆవరణతో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద, గంధం వచ్చే రహదారి వెంబడి 36సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దర్గా ఆవరణలో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామనీ వీటన్నింటిని కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ నుంచి జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్, విజయవాడలోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అక్కడ నుంచే రొట్టెల పండుగలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. సుశిక్షతులైన సిబ్బంది 24గంటల పాటు కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ పత్రి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లుచేపట్టిన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని ఈ సదర్భంగా ఐజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి, నెల్లూరు నగర, ట్రాఫిక్ డిఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి.వి రాముడు, నిమ్మగడ్డ రామారావు, ఒకటి, నాలుగు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ కరీం, సిహెచ్ సీతరామాయ్య, వెంకటరావు, ఎస్ఐలు గిరిబాబు, శ్రీనివాసరెడ్డి, బలరామయ్య, దర్గా కమిటీ సిబ్బంది తదితరులు çపాల్గొన్నారు. -
బోటు నుంచి పర్యవేక్షణ
ఐజీ సంజయ్ ఘాట్ల పరిశీలన గుంటూరు రూరల్ (అమరావతి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే స్నానపు ఘాట్లను ఐజీ సంజయ్ ఆదివారం బోట్ ద్వారా ప్రయాణిస్తూ పరిశీలించారు. తాళ్ళాయపాలెం ఘాట్‌నుంచి బయలుదేరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని స్నానపు ఘాట్లను ఆయన పరిశీలిస్తూ అమరావతిలోని అమరేశ్వర ఘాట్‌వరకూ ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళాయపాలెంనుంచి అమరావతి వరకూ ఉన్న ప్రతి ఘాట్‌ను పరిశీలించానని కొన్ని ప్రాంతాల్లో స్నానాలకు అనువుగాని చోట ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తాళాయపాలెంనుంచి అమరావతి ఘాట్‌వరకూ సుమారు రెండున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. నీరు సమృద్ధిగా ఉండడం, తగిన రక్షణ చర్యలు ఉండడంవల్ల భక్తులు ఆనందంగా స్నానాలు ఆచరిస్తున్నారన్నారు. -
ఘాట్ల వరకూ బస్సులు
ఐజీ సంజయ్ వెల్లడి సీతానగరం (తాడేపల్లి రూరల్) : కృష్ణా పుష్కరాలకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను ఘాట్ల వరకు నడుపుతామని గుంటూరు ఐజీ సంజయ్ తెలిపారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు శనివారం వచ్చిన ఆయన వాహనాల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్‌కు అసౌకర్యం లేకుండా గుంటూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులను నేరుగా సీతానగరం పుష్కర ఘాట్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అక్కడ నుంచి దుర్గ ఘాట్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉండవల్లి సెంటర్ నుంచి దుర్గ ఘాట్ వరకు, అలాగే సీతానగరం ఘాట్ వరకు ఐజీ బస్సులో ప్రయాణించారు. -
వచ్చింది ఐజీ అని గుర్తించలేక..
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఐజీ సంజయ్ శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. మఫ్టీలో వచ్చిన ఆయన స్టేషన్ పరిసరాల్లో ఉన్న బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పోలీసుల పని తీరు ఎలా ఉందంటూ విచారించారు. ఇంత జరుగుతున్నా వచ్చింది ఐజీ అని అక్కడున్న పోలీసులు పసిగట్టలేకపోయారు. ఆలస్యంగా ఎస్ఐ రమేష్‌బాబు ఐజీని గుర్తించి సర్ అనే సరికి అక్కడున్న సీఐ శ్రీధర్‌రెడ్డి, మరో ఎస్ఐ మహమ్మద్ రఫీతోపాటూ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత ఐజీ స్టేషన్ అంతా కలియతిరిగారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. -
తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ..
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): 2008లో ముంబైలో జరిగిన ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శిక్షణ పూర్తి చేసుకున్న 22వ బ్యాచ్ సెక్యూరిటీ గార్డుల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐజీ సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రసంగించారు. ముంబైపై దాడి అనంతరం ఓడరేవుల భద్రతపై శ్రద్ధ పెరిగిందన్నారు. చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచామన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలో కృష్ణపట్నం పోర్టు ప్రథమస్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. పోర్టు విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నం పోలీసుస్టేషన్‌కు ఆయుధాలు సమకూరుస్తామని ఐజీ సంజయ్ చెప్పారు. ఈ అంశంపై సీఎంతో చర్చిస్తున్నామన్నారు. దీని వల్ల పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చే నౌకలకు సాయుధ బలగాల భద్రత ఉంటుందన్నారు. సెక్యూరిటీ కేంద్రం ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేఎస్‌ఎస్‌పీఎల్‌లో యువత ఉపాధి కోసం కొత్త కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనబరచిన గార్డులకు జ్ఞాపికలు అందజేశారు. ఆల్‌రౌండర్‌గా నిలిచిన కే.రమేష్‌కు ఐజీ చేతుల మీదుగా షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక పరిజ్ఞానంపై శిక్షణ అవశ్యం
ఏఎన్‌యూ: ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక పరిజ్ఞానంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బంది శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ అన్నారు. ఁఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆప్ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్* అనే అంశంపై యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం, హైదరాబాద్‌కు చెందిన ట్రూత్ ల్యాబ్స్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు సభ సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఐజీ మాట్లాడుతూ నిపుణులకు తెలిసిన శాస్త్రవిషయూలను అందరికీ పంచటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. పలు కీలక అంశాల్లో ఫోరెన్సిక్ విభాగం ద్వారా పోలీసు శాఖ విశేష సేవలు అందిస్తోందని చెప్పారు. బాంబు పేలుళ్లు, మారణ హోమాలు జరిగినపుడు మృతుల శరీర భాగాలు, ఘటనలకు సంబంధించిన ఆధారాలు సేకరించటం, వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు అనుగుణంగా భధ్రపరచటం చాలా కీలకమని పేర్కొన్నారు. వేలిముద్రల విభాగం, ఇతర కీలక శాఖలు సమన్యయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. నక్సలైట్ల నిర్మూలనలో గ్రే హౌండ్స్ ద ళాలతోపాటు ఫోరెన్సిక్ విభాగం పాత్ర కీలకమని తెలిపారు. ప్రస్తుతం యువత దేశంలో విజ్ఞానాన్ని పెంపొందించుకుని దాని ఫలాలను ఇతర దేశాలకు అందిస్తోందని చెప్పారు. ఇక్కడి జ్ఞాన ఫలాలు ఇక్కడే ఉపయోగపడాలన్నారు. అంబేద్కర్ వంటి మహనీయుల సేవల వల్లే మనం ఈ విధంగా ఉన్నామన్నారు. ఏ స్థాయి అధికారైనా తప్పులు సరిదిద్దుకోవటానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతేనే భయపడాలని చెప్పారు. ఆన్లైన్ విద్యావిధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ డాక్టర్ గాంధీ పీసీ కాజా, లా విభాగాధిపతి ఆచార్య ఎల్.జయశ్రీ తదితరులు ప్రసంగించారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి ఐజీ సర్టిఫికెట్లు అందజేశారు. ఆన్లైన్లో ఫోరెన్సిక్ సంబంధిత కోర్సులు ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏఎన్‌యూ ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు మాట్లాడుతూ ఏఎన్‌యూ, ట్రూత్ ల్యాబ్‌ల మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) ఖరారు కానుందని వెల్లడించారు. అనంతరం ట్రూత్‌ల్యాబ్స్ సహకారంతో ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రం ద్వారా ఆన్లైన్లో పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులను నిర్వహించనున్నామని తెలిపారు.