
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
శంషాబాద్ (రంగారెడ్డి): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన అతని వద్ద నుంచి 1 kg బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.