నిద్రలోనే.. మృత్యుఒడికి | in sleep went to death | Sakshi
Sakshi News home page

నిద్రలోనే.. మృత్యుఒడికి

Published Mon, Aug 1 2016 5:23 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నిద్రలోనే.. మృత్యుఒడికి - Sakshi

నిద్రలోనే.. మృత్యుఒడికి

  రోడ్డు ప్రమాదంలో క్లీనర్‌ మృతి
⇒  ‘ఔటర్‌’పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ

శంషాబాద్‌ రూరల్‌: డీజిల్‌ అయిపోవడంతో రహదారిపై లారీ ఆగిపోయింది.. ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో అందులో నిద్రిస్తున్న క్లీనర్‌ దుర్మరణం చెందాడు. మండల పరిధిలోని లక్ష్మీతండా సమీపంలో ఔటర్‌ రింగు రోడ్డుపై సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఆరాంఘర్‌ ప్రాంతం నుంచి సోమవారం ఉదయం ఓ లారీ కందుకూరు వెళ్తుంది. ఔటర్‌ రహదారిలో లక్ష్మీతండా సమీపంలోని రాగానే లారీలో డీజిల్‌ అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో డ్రైవర్‌ లారీని రోడ్డుపై ఓ పక్క నిలిపాడు. ఇదే సమయంలో చక్కెర లోడుతో మరో లారీ మహారాష్ట్రలోని సోలాపూర్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొంది.

        ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో నిద్రిస్తున్న క్లీనర్‌ దుర్మరణం చెందాడు. లారీ ముందు భాగం ఎడమవైపు ధ్వంసం కావడంతో క్లీనర్‌ మృతదేహం అందులోనే ఇరుక్కుపోయింది. మృతుడు సోలాపూర్‌ వాసి సిరిశైలం(35)గా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన సంజయ్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. క్యాబిన్‌లో నిద్రపోతున్న క్లీనర్‌ ఈ ప్రమాదంతో శాస్వత నిద్రలోకి వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య, కొడుకు, ఓ కూతురు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక క్లష్టర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement