Cleaner died
-
నిద్రలోనే.. మృత్యుఒడికి
⇒ రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి ⇒ ‘ఔటర్’పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ శంషాబాద్ రూరల్: డీజిల్ అయిపోవడంతో రహదారిపై లారీ ఆగిపోయింది.. ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొనడంతో అందులో నిద్రిస్తున్న క్లీనర్ దుర్మరణం చెందాడు. మండల పరిధిలోని లక్ష్మీతండా సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ ప్రాంతం నుంచి సోమవారం ఉదయం ఓ లారీ కందుకూరు వెళ్తుంది. ఔటర్ రహదారిలో లక్ష్మీతండా సమీపంలోని రాగానే లారీలో డీజిల్ అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో డ్రైవర్ లారీని రోడ్డుపై ఓ పక్క నిలిపాడు. ఇదే సమయంలో చక్కెర లోడుతో మరో లారీ మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి విజయవాడ వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో నిద్రిస్తున్న క్లీనర్ దుర్మరణం చెందాడు. లారీ ముందు భాగం ఎడమవైపు ధ్వంసం కావడంతో క్లీనర్ మృతదేహం అందులోనే ఇరుక్కుపోయింది. మృతుడు సోలాపూర్ వాసి సిరిశైలం(35)గా గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన సంజయ్ డ్రైవింగ్ చేస్తుండగా.. ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. క్యాబిన్లో నిద్రపోతున్న క్లీనర్ ఈ ప్రమాదంతో శాస్వత నిద్రలోకి వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య, కొడుకు, ఓ కూతురు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక క్లష్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొన్న డీసీఎం... క్లీనర్ మృతి
కనగానపల్లె: అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్లీనర్ జయచంద్ర (25) అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి
విశాఖపట్నం (అనంతగిరి): విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ యలమంచిలి సన్యాసి రావు (21) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డగారిని విజయనగరం జిల్లా శృంగవరపు కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
60 అడుగుల బావిలోకి లారీ బోల్తా
వేలూరు, న్యూస్‌లైన్: తిరుపత్తూరు సమీపంలో 60 అడుగులు లోతున్న బావిలోకి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి బెంగళూరుకు 32 టన్నుల ఇనుప కమ్మీలతో లారీ బయలుదేరింది. లారీని బన్రొట్టికి చెందిన రాజేంద్రన్(49) నడుపుతున్నాడు. అదే లారీలో క్లీనర్‌గా అతని కుమారుడు జగన్(19), బన్‌రొట్టి జిల్లా కొంజికుప్పం గ్రామానికి చెందిన ఆర్ముగం ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో లారీ తిరుపత్తూరు సమీపంలోని కాళియమ్మాల్ గుడి వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెటు ్టను ఢీకొని పక్కనే ఉన్న 60 అడుగుల లోతు బావిలో పడింది. లారీ అతి వేగంగా ఢీకొనడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి తిరుపత్తూరు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి వెంకటేశన్ అధ్వర్యంలో సిబ్బంది, పోలీసులు బావి వద్దకు చేరుకొని పరిశీలించారు. బావిలో 15 అడుగుల నీరు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే బావిలోని లారీలో చిక్కుకున్న వారు కేకలు వేయడంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి దిగి రాజేంద్రన్, ఆర్ముగం, జగన్‌ను బయటకు తీశారు. అప్పటికే జగన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ రాజేంద్రన్, ఆర్ముగంను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావిలో ఉన్న ఇనుప కమ్మీలను క్రేన్ల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో మూడు క్రేన్లను రప్పించి లారీతో పాటు ఇనుప కమ్మీలను కూడా బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది సకల ప్రయత్నాలు చేస్తున్నారు.