పెద్దాసుపత్రిలోని పలు ఘటనలపై విచారణ | inquiry on general hospital incidents | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రిలోని పలు ఘటనలపై విచారణ

Published Tue, Jul 11 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

inquiry on general hospital incidents

సాక్షి, అమరావతి ఇటీవల కర్నూలు పెద్దాసుపత్రిలో జరిగిన పలు ఘటనలపై విచారణ మొదలైంది. వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్‌) డా.కె.బాబ్జిని ఈ ఘటనలపై విచారణకు ఆదేశించారు. ప్రధానంగా కర్నూలు పెద్దాసుపత్రిలో కరెంటు లేకపోవడంతో 20 మంది చనిపోవడం, ఎలుకల నివారణలో భాగంగా ఒక్కో ఎలుకను పట్టుకునేందుకు రూ.25 వేలు చెల్లించడం, బ్లాక్‌ లిస్టులో పెట్టిన కంపెనీకి నిధులు ఇప్పించేందుకు మంత్రి కామినేని పేషీ నుంచి ఫోన్లు వెళ్లడం తదితర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైనా విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.కె.బాబ్జిని నియమించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో డా.బాబ్జి మంగళవారం కర్నూలు పెద్దాసుపత్రిలో విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement