అనంతపురం సెంట్రల్ : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను అనంతపురం వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు విలువ చేసే 23 తులాల బంగారు, 8 తులాల వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సీసీఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న, వన్‌టౌన్ సీఐ రాఘవన్ దొంగల వివరాలను విలేకరులకు తెలిపారు.
ధర్మవరం మండలం ఎర్రగుంట్లకు చెందిన మదన రామాంజనేయులు, సాతుపాటి శంకర్, అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీకి చెందిన దూదేకుల బాబాఫకృద్దీన్ హమాలీలు. తాగుడు, జూదం తదితర వ్యసనాలకు అలవాటు పడిన వీరు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారు. జిల్లాలోనే కాకుండా కర్ణాటకలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల అనంతపురం శారదానగర్, హౌసింగ్ బోర్డు కాలనీలోlదొంగతనాల పాల్పడ్డారు. సీఐ రాఘవన్‌కు అందిన సమాచారంతో రూరల్ మండలం సోములదొడ్డి వద్ద ఉన్న వీరిని అరెస్ట్ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
Published Fri, Sep 30 2016 11:56 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement