తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య | inter student shekar suicide due to father told him to read | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Jul 1 2016 12:00 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

inter student shekar suicide due to father told him to read

శంషాబాద్‌: చదువుకోవడం లేదని తండ్రి మందలించడంలో మనస్తాపానికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ మండల కేంద్రంలోని రుద్రా కాలనీలో అద్దెకు నివాసముంటు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటు కుమారుడు శేఖర్‌ను ఇంటర్ చదివిస్తున్నాడు.

స్థానికంగా ప్రయివేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన శేఖర్ ఇటీవల వచ్చిన ఫలితాల్లో తప్పడంలో గురువారం ఉదయం తండ్రి అతడిని పిలిచి చదువుకోవాలని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్ ఇంట్లో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement