ఉరి వేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య | INTER STUDENT SUICIDE | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Mar 24 2017 1:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

INTER STUDENT SUICIDE

ఏలూరు అర్బన్‌ :  చుట్టపుచూపుగా పెద్దమ్మ ఇంటికి వచ్చిన ఓ ఇంటర్‌ విద్యార్థి ఇంటిలో ఎవరూలేని సమయంలో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక టూ టౌన్‌ సీఐ ఉడతా బంగార్రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన కల్లూరి సత్యం, సింహాచలం దంపతులు అక్కడే ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసుకుంటూ కుమారుడు శంకరబాబు(17)ను చదివించుకుంటున్నారు. గత ఏడాది మొదట సంవత్సరం ఇంటరీ్మడియెట్‌కు సంబంధించి కొన్ని సబ్జెక్ట్‌లలో శంకరబాబు ఫెయిలయ్యాడు. దీంతో కొంతకాలంగా అతను మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ క్రమంలో పదిరోజుల కిందట ఏలూరు ఆర్‌ఆర్‌పేట కోనపల్లివారి వీధిలో  నివాసం ఉంటున్న పెదనాన్న పైడిబాబుకు ఇంటికి వెళ్లివస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు అతన్ని ఏలూరు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో శంకరబాబు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన పెదనాన్న ఘటన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న సీఐ బంగార్రాజు, ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్‌ గంగాధర్, హెచ్‌సీ సురేష్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుర్ఘటనపై మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు మృతుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని, దర్యాప్తు అనంతరం నిర్ధారణకు వస్తామని సీఐ తెలిపారు.
 
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement