
ఐఆర్‌సీటీసీ హాంకాంగ్ యాత్ర
విజయవాడ: ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో హాంకాంగ్ యాత్ర అక్టోబర్ 8న ఉంటుందని ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ అధికారి ఎన్.డి.భుజంగరావు శనివారం తెలిపారు. 5 పగళ్లు, 4 రాత్రులు ఉండే ఈ యాత్రలో హాంకాంగ్ సిటీటూర్‌లో అవెన్యూస్టార్స్ వద్ద లైట్‌షో డిస్నీలాండ్, షేన్‌జెన్ సిటీటూర్‌లో మినరల్ మ్యూజియం, లోటస్ స్క్వేర్, మకావు సిటీటూర్‌లో సెయింట్ పాల్ చర్చ్, లోటస్‌స్క్వేర్‌ల సందర్శన ఉంటుందని చెప్పారు.
8న హైదరాబాద్‌లో మొదలైన యాత్ర 12వ తేదీ తిరిగి హైదరాబాద్ చేరడంతో ముగుస్తుందన్నారు. టికెట్ ధర, వసతి అన్నీ కలిపి ఒక్కొక్కరికి రూ.73,419 చెల్లించవలసి ఉంటుందని, వివరాలకు 9701360675, 9701360609 నంబర్లకు సంప్రదించాలన్నారు.