
భవిష్యత్తు ఉండదనే విపక్షాలకు బెంగ: ఈటల
కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సం క్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు భవిష్యత్తు ఉండదనే బెంగతోనే పసలేని విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకున్న కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు రాకుండా పారిపోయిన ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టుల రీడిజైనిం గ్‌పై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్ర నేతలకు కొమ్ముకాస్తూ పదవులను అనుభవిస్తూ తెలంగాణను వల్లకాడు చేసిన ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో తెలంగాణలోని భూములన్నింటినీ సస్యశ్యామలం చేసేం దుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపడుతున్నామని స్పష్టం చేశారు.