అలుపెరగని పోరాట యోధుడు జక్కంపూడి
అలుపెరగని పోరాట యోధుడు జక్కంపూడి
Published Mon, Aug 7 2017 12:05 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM
నివాళులర్పించిన విజయసాయిరెడ్డి, బొత్స
కాకినాడ : సామాన్య, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించిన దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అలుపెరగని పోరాటయోధుడిగా అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు అన్నారు. ఆయన 64వ జయంతి సందర్భంగా స్థానిక సరోవర్ పోర్టికోలో ఆదివారం జక్కంపూడి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా జక్కంపూడి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ తరం నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు, కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్లు గొలగాని దుర్గాప్రసాద్, ఐ.శ్రీను, మాజీ కో–ఆప్షన్ సభ్యులు ఇళ్ళ సత్యనారాయణ, మత్స్యకార ప్రతినిధులు కాటాడి జానకిరామ్, బందన హరి, చింతా కామేష్, పార్టీ నాయకులు బెండా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement