vardanti
-
సాయిచంద్ లేని లోటు తీర్చలేనిది
వనస్థలిపురం (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో పాట, మాటలతో తనదైన ముద్ర వేసిన ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువలేదని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మాజీమంత్రి టి.హరీశ్‌రావులు పేర్కొన్నారు. శనివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సాయిచంద్ కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సాయిచంద్ మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ‘‘రాతి బొమ్మల్లోనా కొలువైన శివుడా’’అనే పాట సాయిచంద్ పాడుతుంటే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టుకునేవారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో సాయిచంద్ లేని లోటు కనిపించిందని అన్నారు. సాయిచంద్ సతీమణి రజనీ మాట్లాడుతూ..సాయిచంద్ మరణం తర్వాత పార్టీ, ఉద్యమకారులు, కళాకారులు, అభ్యుదయవాదులు, అంబేడ్కర్ వాదులు, పలు సంఘాల నాయకులు తమకు అండగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రూపొందించిన సాయిచంద్ సంస్మరణ సంచికను కేటీఆర్ విడుదల చేశారు. దేశ్‌పతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాయకులు బాల్కసుమన్, రసమయి బాలకిషన్, సునీతా లక్ష్మారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బూర్గులకు గవర్నర్ దత్తాత్రేయ నివాళి
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. కాగా బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
రంగాకు వైఎస్సార్సీపీ ఘన నివాళి
సాక్షి, నెట్వర్క్: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్.పద్మజ, ఎం.అరుణ్‌కుమార్, కొండా రాఘవరెడ్డి తదితరులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. రంగా చిత్రపటానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, విజయవాడ నగర కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు మల్లాది విష్ణు నివాళులర్పించారు. రంగాపై వెబ్ సిరీస్ తన తండ్రి వంగవీటి రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతానని వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. రంగా వర్థంతి సందర్భంగా మంగళవారం విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. రంగా జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలో వెబ్ సిరీస్ తీయనున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో.. వైఎస్సార్సీపీ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. ఎన్ఆర్ఐలు దీపక్ గోపాలం, సునీల్ మందుటి, చెంచురెడ్డి, దేవనాథరెడ్డి, గోపిరెడ్డి, రవి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ గాయం, నరేశ్ పూల, ధీరజ్, ప్రసాద్, లలిత్ వడ్లమూడి, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, నలిపిరెడ్డి తదితరులు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. -
అలుపెరగని పోరాట యోధుడు జక్కంపూడి
నివాళులర్పించిన విజయసాయిరెడ్డి, బొత్స కాకినాడ : సామాన్య, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించిన దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అలుపెరగని పోరాటయోధుడిగా అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు అన్నారు. ఆయన 64వ జయంతి సందర్భంగా స్థానిక సరోవర్ పోర్టికోలో ఆదివారం జక్కంపూడి చిత్రపటానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితునిగా జక్కంపూడి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ తరం నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు, కాకినాడ నగర పార్టీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఇనుకొండ పట్టాభిరామయ్య, మాజీ కార్పొరేటర్లు గొలగాని దుర్గాప్రసాద్, ఐ.శ్రీను, మాజీ కో–ఆప్షన్ సభ్యులు ఇళ్ళ సత్యనారాయణ, మత్స్యకార ప్రతినిధులు కాటాడి జానకిరామ్, బందన హరి, చింతా కామేష్, పార్టీ నాయకులు బెండా విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.