
సన్నిహితులతో పవన్ కల్యాణ్ మంతనాలు
తిరుమల: సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఆయన శుక్రవారమిక్కడ టీఎస్ఆర్ అతిథి గృహంలో సన్నిహితులతో చర్చిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిని ఇందిరా మైదానంలో బహిరంగ నిర్వహించనున్నారు. పార్టీపై అభిమానులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ విషయంపై తిరుమలలో అభిమానులతో పవన్ సమాలోచనలు జరుపుతున్నారు. సభ నిర్వహణ కోసం నగర పాలక సంస్థ, పోలీసుల అనుమతి కోరారు. ప్రశాంతగా సభ జరుపుకోవాలని పోలీసులు అనుమతి ఇచ్చినట్లు జనసేన పార్టీ కార్యకర్తలు తెలిపారు. కాగా రేపు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
కర్ణాటక కోలార్లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన వినోద్ రాయల్ కుటుంబాన్ని పవన్ నిన్న తిరుపతిలో పరామర్శించారు. అనంతరం ఆయన వెంకన్న దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత పవన్ కొండపైనే అతిథిగృహంలో బస చేశారు. రేపు మళ్లీ స్వామివారి సేవలో పాల్గొంటారు.