అనంతపురం న్యూసిటీ : భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు జనార్దన్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ విషయాన్ని జనార్దన్ పని చేస్తున్న ఎన్‌టీఆర్ స్కూల్‌కు, త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. గత నెల 28న జనార్దన్ భార్య జయశ్రీ(35) అనుమానాస్పద మతి చెందగా, త్రీ టౌన్ పోలీసులు జనార్దన్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెల్సిందే.