జనవరి 2న సీఎం రాక | january 2nd cm visit | Sakshi
Sakshi News home page

జనవరి 2న సీఎం రాక

Published Sat, Dec 17 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

january 2nd cm visit

కర్నూలు సిటీ: కేసీ కాలువకు కృష్ణా జలాలను మళ్లించేందుకు నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసేందుకు జనవరి 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. కేసీకి తుంగభద్ర జలాలు సక్రమంగా రాకపోవడంతో ఏటా సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి సమీపంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు పూర్తయింది. ఇటీవల రెండు మోటార్లు ఏర్పాటు చేసి ఈఈ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పథకాన్ని జాతికి అంకితం చేసేందుకు సీఎం జిల్లాకు రానున్నట్లు జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement