తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది | jayapradha visits mahanadhi temple | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది

Jun 9 2016 9:47 AM | Updated on Apr 3 2019 8:58 PM

తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది - Sakshi

తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది

తెలుగు ప్రేక్షకులు, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు.

మహానంది: తెలుగు ప్రేక్షకులు, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం రాత్రి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధ్‌రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు.

అనంతరం ఆమె శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. వినాయకనందీశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి రావడం ఇదే మొదటిసారి అని, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానంది పుణ్యక్షేత్రం పర్యాటక స్థలంగా మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నూతన దర్శకుడు నరసింహం దర్శకత్వంలో వస్తున్న ‘శరభ’ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement