mahanadhi temple
-
మహానందిలో ముగిసిన కల్యాణోత్సవం
-
శివ శివా.. ఏమిటీ అపచారం!
సాక్షి,కర్నూలు(మహానంది): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహానందిలో గురువారం అపచారం చోటు చేసుకుంది. ఆలయ ఆవరణ, అందులోనూ ఈఓ ఇంటి వెనుకే కొందరు భక్తులు మద్యం తాగుతూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు రెండు వాహనాల్లో మహానందికి వచ్చారు. ఈఓ ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో కూర్చుని మద్యం తాగుతూ కాలక్షేపం చేస్తుండటంతో గమనించిన భక్తులు ఆవేదన చెందారు. దేవదాయశాఖ నిబంధనల మేరకు ఆలయ ప్రాంగణంలోకి మద్యం, మాంసం తీసుకు రాకూడదు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, దేవస్థానం అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని హిందూ ధర్మపరిరక్షణ సమితి, హిందూసంఘాల నాయకులు కోరుతున్నారు. కాగా వ్యక్తిగత లాభాపేక్షకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడి పవిత్రతను కాపాడేందుకు ఆలయ అధికారులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది
మహానంది: తెలుగు ప్రేక్షకులు, ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద పేర్కొన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బుధవారం రాత్రి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సురేంద్రనాధ్రెడ్డి ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. వినాయకనందీశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి రావడం ఇదే మొదటిసారి అని, ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహానంది పుణ్యక్షేత్రం పర్యాటక స్థలంగా మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నూతన దర్శకుడు నరసింహం దర్శకత్వంలో వస్తున్న ‘శరభ’ చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నానని తెలిపారు.