ఉన్నత విద్య.. ఉద్యోగం | Job in higher education .. | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య.. ఉద్యోగం

Published Thu, Apr 6 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

ఉన్నత విద్య.. ఉద్యోగం

ఉన్నత విద్య.. ఉద్యోగం

⇒డిగ్రీ తర్వాత ఎన్నో అవకాశాలు 
⇒అందుబాటులో యూనివర్సిటీ విద్య
⇒ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులు


డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అత్యున్నత విద్య.. ఉపాధి పొందే కోర్సులు అభ్యసించవచ్చు. పోటీ పరీక్షలు రాసి మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఉద్యో గం చేస్తూ కూడా ఆసక్తి ఉన్న ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.

యూనివర్సిటీక్యాంపస్‌ (తిరుపతి): ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల చివరికి పరీక్షలు పూర్తికానున్నాయి. ఈనేపధ్యంలో ఏంచేయాలని విద్యార్థులు ఆలోచనలో ఉన్నారు.  జిల్లాలో 136 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేలమంది డిగ్రీ చదువుతున్నారు. చివరి సంవత్సరం చదువుతున్న వారి సంఖ్య దాదాపు 25వేలు ఉంది. వీరిలో కొంతమంది డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్నారు.

దూరవిద్య
రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లి చదవలేని వారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ వివిధ పీజీ కోర్సులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. ప్రస్తుతం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మిగతా యూనివర్సిటీలకు నోటిఫికేష న్‌ రావాల్సి ఉంది.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు ప్రవేశానికి నాగార్జున యూనివర్సిటీ నిర్వహించే పీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్వీయూ, మహిళా వర్సిటీతో పాటు ఐదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సు
డిగ్రీ తర్వాత హాస్పిటాలిటీ, జర్నలిజం, ఫ్యాషన్‌ అండ్‌ డిజైనింగ్, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళా వర్సిటీల్లో మరికొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్‌ కళాశాలలు, ఇతర సంస్థలు కూడా కొన్ని అందిస్తున్నాయి.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌
డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కాని, ఉన్నత విద్యకాని అవసరం లేదనుకునేవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ద్వారా వివిధ రకాల చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్వీయూ, మహిళా విశ్వవిద్యాలయాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ తరగతులు అప్పుడప్పుడూ నిర్వహిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాలు
డిగ్రీ పూర్తయిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో విజయం సా«ధిస్తే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. యూపీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసి వాటిని పొందవచ్చు.  బ్యాంకింగ్, డిఫెన్స్, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా పలు ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవి కాకుండా ఉన్నత విద్య పొందేవారికి రెగ్యులర్, దూరవిద్య ద్వారా అనేక విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సులు అందిస్తున్నాయి.

పోస్టు గ్రాడ్యుయేషన్‌
డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ కోర్సులు చదవాలనుకునేవారికి ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాలు పలు రకాల సబ్జెక్టుల్లో పీజీ కోర్సులు అందిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులు సీటు పొందవచ్చు. ఇక్కడ అడ్మిషన్‌ పొందినవారికి  హాస్టల్‌ వసతి కూడా అందుబాటులో ఉంది. అంతేగాకుండా క్యాంపస్‌లోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. మహిళా వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21న ప్రవేశ పరీక్ష నిర్వహించి జూన్‌లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ ప్రవేశానికి ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10 నుంచి 16వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 5 నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

న్యాయవాద కోర్సులు
డిగ్రీ పూర్తిచేసిన వారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించే లాసెట్‌ ప్రవేశ పరీక్ష రాసి మూడు సంవత్సరాల లా కోర్సులో చేరవచ్చు. జిల్లాలో మహిళా వర్సిటీతో పాటు ఏడు లా కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement