అక్రమ కేసులు బనాయించడం సరికాదు
హిందూపురం అర్బన్ : అవినీతి అక్రమాలను ఎండకట్టి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపించే మీడియాపై కక్ష సాధింపుగా అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సీనియర్ విలేకరులు రాంప్రసాద్, ప్రకాష్ అన్నారు. గుంటూరులో సాక్షి పత్రికా విలేకరులపై పోలీస్ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ హిందూపురంలో ఆదివారం ప్రతికా, మీడియా ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రతికా స్వేచ్ఛను కాపాడాలని, మీడియాపై ఆంక్షలు విధించరాదని ప్లకార్డులు పట్టుకుని స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలికితీస్తున్నపుడు కక్షసాధింపు చర్యలు చేపట్టడం ప్రతికా స్వేచ్ఛను హరించడమేన న్నారు. ఇప్పటికైనా విలేకరులపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తి వేసి ప్రతికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విలేకరులు రమేష్, సురేష్‌రెడ్డి, రాము, లక్ష్మిరెడ్డి, సాయిచరణ్, రాజేష్, హరికష్ణారెడ్డి, ప్రకాష్, ప్రదీప్, రమణ తదితరులు పాల్గొన్నారు.