జూరాల నుంచి శ్రీశైలంకు వరద నీరు | jurala to srisailam | Sakshi
Sakshi News home page

జూరాల నుంచి శ్రీశైలంకు వరద నీరు

Published Mon, Aug 1 2016 1:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం 48 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు: 
శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం 48 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భజలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రెండు జనరేటర్లతో విద్యుత్‌ ఉత్పాదన చేసి నిలిపివేశారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పాదనను చేపడుతున్నారు. మొత్తం జలాశయంలో 40.8748 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 820 అడుగులకు చేరుకుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement