హోరాహోరీగా కబడ్డీ ఎంపిక పోటీలు | kabaddi selections | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా కబడ్డీ ఎంపిక పోటీలు

Published Sun, Sep 18 2016 7:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

హోరాహోరీగా కబడ్డీ ఎంపిక పోటీలు

హోరాహోరీగా కబడ్డీ ఎంపిక పోటీలు

 గోపన్నపాలెం (దెందులూరు) : స్థానిక ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ఆదివారం జిల్లా స్థాయి పురుషుల, మహిళల కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక  పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 150 మంది పురుషులు, 70 మంది మహిళలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.రాము, కార్యదర్శి రంగారావు, జాయింట్‌ సెక్రటరీ పీవీకేడీ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వచ్చేనెల 6 నుంచి 9 వరకు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ చైర్మన్‌ ఎన్‌వీఆర్‌ దాసు, చీఫ్‌ ప్యాటరన్‌ కొండలరావు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement