
నీళ్లు నమిలిన కళా వెంకట్రావు
పార్టీ ఫిరాయింపులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆంధ్ర్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కె. కళా వెంకట్రావు నీళ్లు నమిలారు.
విజయవాడ : పార్టీ ఫిరాయింపులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆంధ్ర్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కె. కళా వెంకట్రావు నీళ్లు నమిలారు. ఆదివారం విజయవాడలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవడంపై కళా వెంకట్రావుకు విలేకర్లు కొన్ని ప్రశ్నలు సంధించారు. అందులోభాగంగా ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ గతంతో మహానాడులో టీడీపీ తీర్మానం చేసింది కదా... మరీ ఇప్పుడు ఇదేమిటి అని కళా వెంకట్రావును విలేకర్లు ప్రశ్నించారు.
దీనిపై ఆయన తన సమాధానాన్ని దాటవేశారు. అభివృద్ధిలో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ జవాబు ఇచ్చారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో టీడీపీ ఎమ్మెల్యేలు చేరికలను కూడా ఇదే కోణంలో చూస్తారా ?అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కూడా కళా వెంకట్రావు సమాధానం దాట వేశారు.