60 సెకన్లలో 12 విగ్రహాలు..
కరీంనగర్: ఎనిమిది సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన పీక మాద్విక(14) అనే చిన్నారి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. కరీంనగర్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పీక శశిధర్ కుమార్తె మాద్విక గతేడాది నవంబర్ 24న తన ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది.
ఆన్‌లైన్‌లో ఆమె ప్రతిభను పరిశీలించిన ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆమెకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మాద్విక గతంలోనూ పలు రికార్డులు సాధించింది. ఈ చిన్నారి గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా లిటిల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంది.