ginnis book
-
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్‌రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు.. ఇంకా తెల్లవెంట్రుక కూడా రాలేదట
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు. ఈమె పేరు అమంతినా దోస్ శాంటోస్ డువిర్జెమ్. ప్రస్తుతం ఈమె వయసు 123 ఏళ్లు. ఈమె 1900 జూన్ 22న జన్మించింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొంది. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు ఈమేనని బ్రెజిల్ అధికారులు కూడా ధ్రువీకరించారు. బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రానికి చెందిన సెర్రాగాయాస్ పట్టణంలో ఈమె ఒంటరిగా తన కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటోంది. పెండలం దుంపల పిండితో తయారు చేసిన కేకు, ఉడికించిన గుడ్లు ఈమెకు ఇష్టమైన ఆహారం. శతాధిక వృద్ధురాలైనా ఇప్పటికీ ఈమెకు డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఇప్పటివరకు మందులు వాడాల్సిన అవసరం తనకు రాలేదని, కనీసం తలనొప్పి కూడా ఎరుగనని చెబుతోందీమె. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ ఈమె తల నెరవకపోవడం మరో విశేషం. ఈమె నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన స్థానిక అధికారులు వారం రోజుల ముందుగానే ఈమె పుట్టినరోజు పార్టీని ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అధికారులు ఈమెకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. అందువల్ల గిన్నిస్‌బుక్ ఈమెను గుర్తించలేదు. గిన్నిస్‌బుక్ రికార్డుల ప్రకారం ప్రస్తుతం అత్యంత వృద్ధమహిళ వయసు ఈ ఏడాది మార్చి 4 నాటికి 116 ఏళ్లు. అమెరికాలో స్థిరపడిన ఆ స్పానిష్ మహిళ పేరు బ్రాన్యాస్ మోరేరా. అయితే, గిన్నిస్ అధికారులు గుర్తించినా, లేకున్నా అమంతినానే ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళ అని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. -
60 సెకన్లలో 12 విగ్రహాలు..
కరీంనగర్: ఎనిమిది సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన పీక మాద్విక(14) అనే చిన్నారి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. కరీంనగర్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పీక శశిధర్ కుమార్తె మాద్విక గతేడాది నవంబర్ 24న తన ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆన్లైన్లో ఆమె ప్రతిభను పరిశీలించిన ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆమెకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మాద్విక గతంలోనూ పలు రికార్డులు సాధించింది. ఈ చిన్నారి గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా లిటిల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంది. -
నీడిల్‌పై నిలబెడతాడు..
మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టమంటే.. చేసేస్తారేమోగానీ.. ఇది చేయగలరా.. సూది మీద పడిపోకుండా గుడ్డును నిలబెట్టగలరా? అదీ బాగా సన్నంగా ఉండే సిరంజి సూది మీద..? ఈయన నిలబెట్టగలడు.. కోడి గుడ్లనే కాదూ.. పెద్దగా ఉండే ఆస్ట్రిచ్ గుడ్లను కూడా.. అదీ కేవలం 10 సెకన్లలో పని పూర్తి చేసేస్తాడు. ఇలాగ ఎవరూ చేయలేరు కాబట్టే.. గత మూడేళ్లుగా ఈ విభాగంలోని గిన్నిస్ రికార్డు ఈయన పేరు మీదే ఉంది. ఇంతకీ ఈయన పేరు చెప్పలేదు కదూ.. పేరు క్యూజుగో.. చైనాలోని చాంగ్ సాలో ఉంటాడు. ఇంతకీ క్యూజుగో ఈ విద్యలో ఎలా ఆరితేరాడో తెలుసా? ఆయనో ట్రక్ డ్రైవర్. రాత్రి వేళల్లో బండి నడుపుతున్నప్పుడు నిద్ర ముంచుకు వచ్చేసేదట. నిద్రాదేవతను తరిమికొట్టడానికి.. ఓసారి ఇది ట్రై చేశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. చివరికిదో అలవాటుగా మారి.. గిన్నిస్ బుక్‌లో క్యూజుగో పేరు ఎక్కేదాకా పోయింది. -
ఎంత ‘లోతు’ ప్రేమయో...!
బ్యాంకాక్: బ్యాంకాక్‌లో ఓ జంట తమ పెళ్లినే సహాసకృత్యంగా మార్చుకొని గిన్నిస్‌బుక్‌లో చోటుసంపాదించింది. జపాన్‌కు చెందిన హిర్యోకీ యోషిడా డైవింగ్ శిక్షకుడు.. వృత్తిలో తన సహచరురాలైన అమెరికాకు చెందిన సాంద్రాను భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. అయితే తాము ఒక్కటయ్యే మధురక్షణాలు భిన్నగా ఉండాలనుకున్న వారు నీటిలోపల పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఆరునెలల నుంచి కఠోర శిక్షణ కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని సాంగ్హంగ్లేక్లో నీటిలోపల 130 మీటర్ల లోతులో వేదికసిద్ధం చేసుకున్నారు. సహచరుల సమక్షంలో 190నిమిషాలపాటు జరిగిన పెళ్లితంతులో పెళ్లికొడుకు పెళ్లికూతురు చెయ్యికి వజ్రపు ఉంగరాన్ని తొడిగి తమ ‘లోతైన’ ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పారు.