ఎంత ‘లోతు’ ప్రేమయో...!
బ్యాంకాక్: బ్యాంకాక్‌లో ఓ జంట తమ పెళ్లినే సహాసకృత్యంగా మార్చుకొని గిన్నిస్‌బుక్‌లో చోటుసంపాదించింది. జపాన్‌కు చెందిన హిర్యోకీ యోషిడా డైవింగ్ శిక్షకుడు.. వృత్తిలో తన సహచరురాలైన అమెరికాకు చెందిన సాంద్రాను భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. అయితే తాము ఒక్కటయ్యే మధురక్షణాలు భిన్నగా ఉండాలనుకున్న వారు నీటిలోపల పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
అందుకు తగ్గట్టుగా ఆరునెలల నుంచి కఠోర శిక్షణ కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని సాంగ్‌హంగ్‌లేక్‌లో నీటిలోపల 130 మీటర్ల లోతులో వేదికసిద్ధం చేసుకున్నారు. సహచరుల సమక్షంలో 190నిమిషాలపాటు జరిగిన పెళ్లితంతులో పెళ్లికొడుకు పెళ్లికూతురు చెయ్యికి వజ్రపు ఉంగరాన్ని తొడిగి తమ ‘లోతైన’ ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పారు.