Sandra
-
USA: చేయని తప్పుకు 43 ఏళ్లు కారాగారంలోనే
వాషింగ్టన్: చేయని నేరానికి 43 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించిన అమాయకురాలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. అమెరికాలోని ఒహాయోకు చెందిన 63 ఏళ్ల సాండ్రా హెమ్మీ కథ ఇది. మిస్సోరీలో 1980లో ఓ లైబ్రరీ వర్కర్‌ను కత్తితో పొడిచి చంపిందని సాండ్రాను అరెస్ట్ చేశారు. లాయర్‌తో వాదించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మానసిక చికిత్సకు అధిక మోతాదులో తీసుకున్న ఔషధాల మత్తులో ఆమె చెప్పిన నేరాంగీకార వాంగ్మూలాన్నే పోలీసులు కోర్టుకు సమరి్పంచారు. దాంతో ఆమెకు జీవితఖైదు విధించారు. కానీ అసలు హంతకుడు మైఖేల్ హోల్మ్యాన్ అనే పోలీసు అధికారి. ఈ విషయాన్ని సాండ్రా లాయర్లు ఆధారసహితంగా తాజాగా కోర్టులో నిరూపించారు. దాంతో ఆమె శుక్రవారం విడుదలయ్యారు. కూతురు, మనవరాలిని హత్తుకుని బోరున విలపించారు. అమెరికా చరిత్రలో చేయని నేరానికి అత్యంత ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన మహిళగా సాండ్రా పేరు నిలిచిపోనుంది. -
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్
శాన్‌జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది. మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. -
పరీక్ష రాస్తావా తల్లీ పడవ రెడీ
కేరళరాష్ట్రం అక్షరాస్యతలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. దాదాపు 94 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం అది. అందరూ చదువుకుంటున్నారు కాబట్టి అక్షరాస్యతలో తొలిస్థానంలో నిలిచిందా? లేక ఆ సమాజంలో చదువుకునే వాతావరణం వల్లనే ఆ రాష్ట్రం ముందంజలో ఉందా? అదీ కాకపోతే పాలకులు కూడా ప్రతి విద్యార్థి చదువునీ తమ పిల్లల చదువులాగానే భావించి బాధ్యత తీసుకుంటున్నారా? కేరళ అక్షరాస్యతలో అగ్రభాగాన నిలవడానికి పైవన్నీ కారణాలే. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక అమ్మాయి పరీక్షలు రాయడానికి ప్రభుత్వం ఒక పడవనే ఏర్పాటు చేసింది. డెబ్బైమంది ప్రయాణించగలిగిన సామర్థ్యం కలిగిన ఆ పడవలో ఆమె ఒక్కర్తే వెళ్లి పరీక్ష రాసి తిరిగి అదే పడవలో ఇంటికి వచ్చింది. ఆమె పరీక్ష రాసినంతసేపు ఆ పడవ ఆమె కోసం నిరీక్షిస్తూ ఏటి గట్టున ఉండేది. పడవతోపాటు పడవ నడిపే ఇంజన్ డ్రైవరు, పడవలో టికెట్ ఇచ్చే కండక్టర్ కూడా ఆమె పరీక్ష కోసమే పని చేశారు. ఆ అమ్మాయి పేరు సాండ్రా. అక్షరం అమూల్యం సాండ్రా పదకొండవ తరగతి విద్యార్థిని. ఆమె పరీక్షలు రాస్తున్న సమయంలో కరోనా విజృంభించింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా చివరి రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షలు గడచిన మే నెల చివర్లో జరిగాయి. ఆ పరీక్షలకు వెళ్లడానికి ఆమెకు రవాణా సాధనమేదీ అందుబాటులో లేదు. నీటిలో ఈదుతూ వెళ్లడం ఒక్కటే ఆమె ముందున్న మార్గం. ఆ పరిస్థితిలో ఆమె నివసించే దీవి నుంచి పరీక్ష రాయాల్సిన స్కూలుకు తీసుకెళ్లడానికి వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చింది. ఆమె నివసించే దీవి అలప్పుళ జిల్లాలో ఉంది. ఆమె చదివే ఎస్ఎన్డీపీ హయ్యర్ సెకండరీస్కూల్ కొట్టాయం జిల్లా కంజీరమ్‌లో ఉంది. ప్రభుత్వం నడిపే రవాణా పడవలో స్కూలుకెళ్లేది. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా బోట్లు ఏవీ తిరగడం లేదు. సాండ్రా పరిస్థితి తెలుసుకున్న ప్రభుత్వం కేరళ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బోట్‌ను ఆమెకోసం కేటాయించింది. ఆ సంగతి తెలిసిన తర్వాత ఆమె ఆనందం పట్టలేకపోయింది. పరీక్షలను సంతోషంగా రాసింది. నిజానికి ఆ బోట్‌కు జిల్లాలో నడుపుకునే అనుమతి మాత్రమే ఉంది. సాండ్రా పరీక్షల కోసం జిల్లా దాటి ప్రయాణించడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ‘ఆర్థికంగా ఎంత ఖర్చు అనేది అస్సలు విషయమే కాదు, ఒక విద్యార్థి చదువుకంటే డబ్బు ముఖ్యం కాదు’ అన్నారు ప్రభుత్వ అధికారులు. అత్యంత సామాన్యకుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చదువు కోసం ప్రభుత్వం చూపించాల్సిన శ్రద్ధనే చూపించింది. -
9 వేల డాలర్లు... గుటకాయ స్వాహా
భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బు మొత్తాన్ని అమాంతం మింగేసిందో భార్య. కొలంబియాలోని బుకర్మంగాకు చెందిన 28 ఏళ్ల శాండ్రా మిలెనా అనే ఒక యువతి ఈ నెల 22న విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. తొలుత గ్యాస్ట్రిక్ సమస్యగా భావించిన వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. కానీ శస్త్రచికిత్సలో వైద్యులను నివ్వెరపరిచే ఒక దృశ్యం కనిపించింది. ఆమె కడుపు నిండా 100 అమెరికన్ డాలర్ల కరెన్సీతో నిండిపోయి ఉంది. వైద్యులు దాదాపుగా డబ్బు మొత్తాన్ని బయటకు తీసివేశారు. అలా తీసివేయగా వచ్చిన డబ్బు 5,700 డాలర్లు (రూ. 3.66 లక్షలు) వచ్చింది. దీంతో వైద్యులు వెంటనే పోలీసులను పిలిపించారు. పోలీసులు సదరు యువతిని విచారించగా అందరూ నిర్ఘాంతపోయే వాస్తవాన్ని పోలీసులకు తెలిపింది. తాను, తన భర్త పనామాకు వెళ్లి చక్కని జీవితాన్ని గడపాలని భావించినట్లు, దానికోసం ఇద్దరం కలిసి కొంత సొమ్మును కూడబెట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే తమ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిపింది. దీంతో తామిద్దరం విడిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కూడబెట్టిన డబ్బుతో పాటు, ఫర్నీచర్, మోటార్‌సైకిల్ అమ్మగా వచ్చిన డబ్బును చెరిసగం పంచుకోవాలని తన భర్త ప్రతిపాదించాడని తెలిపింది. దీనికి తాను ఒప్పుకున్నట్లే నటించి ఆ డబ్బు తన భర్తకు దక్కకూడదనే కోపంతో కరెన్సీ మొత్తాన్ని మింగేశానని చెప్పింది. శాండ్రా మింగిన మొత్తం 9 వేల డాలర్లు (రూ. 5.78 లక్షలు) విలువ చేసే 100 డాలర్ల కరెన్సీ కావడం గమనార్హం. -
బెయిల్ షరతులు సడలించాలి: సండ్ర
-
నేడు సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ
-
ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ
-
'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'
-
ఎంత ‘లోతు’ ప్రేమయో...!
బ్యాంకాక్: బ్యాంకాక్‌లో ఓ జంట తమ పెళ్లినే సహాసకృత్యంగా మార్చుకొని గిన్నిస్‌బుక్‌లో చోటుసంపాదించింది. జపాన్‌కు చెందిన హిర్యోకీ యోషిడా డైవింగ్ శిక్షకుడు.. వృత్తిలో తన సహచరురాలైన అమెరికాకు చెందిన సాంద్రాను భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. అయితే తాము ఒక్కటయ్యే మధురక్షణాలు భిన్నగా ఉండాలనుకున్న వారు నీటిలోపల పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఆరునెలల నుంచి కఠోర శిక్షణ కూడా తీసుకున్నారు. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లోని సాంగ్హంగ్లేక్లో నీటిలోపల 130 మీటర్ల లోతులో వేదికసిద్ధం చేసుకున్నారు. సహచరుల సమక్షంలో 190నిమిషాలపాటు జరిగిన పెళ్లితంతులో పెళ్లికొడుకు పెళ్లికూతురు చెయ్యికి వజ్రపు ఉంగరాన్ని తొడిగి తమ ‘లోతైన’ ప్రేమను ప్రపంచానికి చాటిచెప్పారు.