నీడిల్‌పై నిలబెడతాడు.. | eggs stand on needle | Sakshi
Sakshi News home page

నీడిల్‌పై నిలబెడతాడు..

Published Tue, Apr 1 2014 12:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

నీడిల్‌పై నిలబెడతాడు.. - Sakshi

నీడిల్‌పై నిలబెడతాడు..

మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టమంటే.. చేసేస్తారేమోగానీ.. ఇది చేయగలరా.. సూది మీద పడిపోకుండా గుడ్డును నిలబెట్టగలరా? అదీ బాగా సన్నంగా ఉండే సిరంజి సూది మీద..? ఈయన నిలబెట్టగలడు.. కోడి గుడ్లనే కాదూ.. పెద్దగా ఉండే ఆస్ట్రిచ్ గుడ్లను కూడా.. అదీ కేవలం 10 సెకన్లలో పని పూర్తి చేసేస్తాడు. ఇలాగ ఎవరూ చేయలేరు కాబట్టే.. గత మూడేళ్లుగా ఈ విభాగంలోని గిన్నిస్ రికార్డు ఈయన పేరు మీదే ఉంది. ఇంతకీ ఈయన పేరు చెప్పలేదు కదూ.. పేరు క్యూజుగో.. చైనాలోని చాంగ్ సాలో ఉంటాడు. ఇంతకీ క్యూజుగో ఈ విద్యలో ఎలా ఆరితేరాడో తెలుసా? ఆయనో ట్రక్ డ్రైవర్. రాత్రి వేళల్లో బండి నడుపుతున్నప్పుడు నిద్ర ముంచుకు వచ్చేసేదట. నిద్రాదేవతను తరిమికొట్టడానికి.. ఓసారి ఇది ట్రై చేశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. చివరికిదో అలవాటుగా మారి.. గిన్నిస్ బుక్‌లో క్యూజుగో పేరు ఎక్కేదాకా పోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement