Vinayaka statues
-
కొలువుదీరనున్న గణపయ్య
ఎదులాపురం (ఆదిలాబాద్): గణేశ్ నవరాత్రులకు జిల్లా ముస్తాబైంది. గురువారం వినాయక చవితిని పురస్కరించుకోని జిల్లావ్యాప్తంగా గణనాథులు కొలువుదీరనున్నారు. జిల్లాలో మొత్తం 826 వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గణేశ్ మండలి కమిటీల ఆధ్వర్యంలో మండపాలను సిద్ధం చేశారు. మండపాల అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వివిధ ఆకృతుల్లో చేపట్టిన నిర్మాణాలతో మండపాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచే భారీ విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో మండపాలకు తరలించారు. గురువారం చవితి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. పలువురు ఒక రోజు ముందుగానే వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ కనిపించారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం పెరిగిన నేపథ్యంలో చాలా మంది మట్టి గణపతులను ప్రతిష్టించేందుకు ఉత్సాహం చూపించడం విశేషం. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో జై శ్రీరాం గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయక చౌక్ సమీపంలో 51 అడుగుల వినాయక ప్రతిమను, కుమార్ జనతా మండల ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహంతో పాటు 25 ఫీట్ల శ్రీకృష్ణ విశ్వరూప ప్రతిమను (గీతాబోధన చేస్తున్నట్లుండే) ఏర్పాటు చేశారు. రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కిసాన్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో కర్ర గణపతిని ప్రతిష్టిస్తున్నారు. పట్టణంలోని పలు మండళ్లలో వినూత్నంగా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు.. జిల్లావ్యాప్తంగా 826 గణనాథులు కొలువుదీ రుతుండగా, జిల్లా కేంద్రం పరిధిలో 453 మండపాలు ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో మండపానికి ఒకరిని నియమిస్తూ, ప్రతి 10 గణేశ్ మండళ్లను ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. క్లస్టర్‌కు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును నియమించి రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 58 ప్రధాన మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 32, ఇచ్చోడలో 9, ఉట్నూర్‌లో 17 మండపాల వద్ద ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్ని గణేశ్ మండళ్ల సభ్యులతో సమావేశాలు నిర్వహించి, వారి వివరాలను సేకరించారు. ఒక్కో గణేశ్ మండలిలో ఇద్దరు వ్యక్తులు (కార్య నిర్వాహకులకు) రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చూసుకోవాలని సూచించారు. -
పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందుతాగిన మహిళ
మిర్యాలగూడ అర్బన్ : పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. బాధిరాలు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన బట్టు రవి అతడి భార్య సునీత పట్టణంలోని ఈదులగూడ వద్ద వినాయక విగ్రహాలు తయారు చేయడానికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సోనుతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. విగ్రహాల తయారికి సుమారు రూ.4 లక్షలకుపైగా ఖర్చు పెట్టారు. విగ్రహాలు పూర్తికావచ్చిన తరుణంలో పట్టణానికి చెందిన ప్రసాద్ రెండు నెలలుగా విగ్రహాల తయారికి పెట్టిన పెట్టుబడిని మీకు వడ్డీతో ఇస్తానని ఆ మెత్తం విగ్రహాలను వదిలి వెళ్లాలని రవిని వేధించసాగాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు సైతం జరిగాయి. దీంతో ప్రసాద్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ప్రసాద్ వేధిస్తుండడంతో.. రవి విగ్రహాల తయారీ వద్దకు రావడంలేదు. భయాందోళనకు గురైన రవి భార్య సునీత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టమని లేకుంటే విగ్రహాల తయారీకి పెట్టిన పెట్టుబడిరాకుంటే అప్పుల పాలవుతామని చెప్పడంతో తిరిగి సోమవారం రవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ప్రసాద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన సునీత మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా ఇరువురు పడిన గొడవలో గతంలో కేసు పెట్టామని, ప్రసాద్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదని పేర్కొన్నాడు. -
రేపటి వరకూ నిమజ్జనాలు..
హైదరాబాద్: లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొంటున్న గణనాథుడి నిమజ్జనోత్సవం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. జంట నగరాల్లో ప్రధానమైన గణేష్ విగ్రహాలు మొత్తం 11,074 ఏర్పాటు చేయగా, ఈ రాత్రి 5 వేల వరకు విగ్రహాలు నిమజ్జనం కావచ్చని, రేపు కూడా విగ్రహాల నిమజ్జనం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. గురువారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతున్నప్పటికీ అనేక మండపాల నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రారంభం అయిందని అన్నారు. డీజీపీ, తన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీ కుమార్‌లతో కలిసి విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్ తో పాటుగా దగ్గరలోని చెరువుల్లోనూ ప్రజలు అనందోత్సహాల మధ్య గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. ఖైరతాబాద్ గణేశుడుని మధ్యాహ్నం రెండున్నర గంటలకు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారని, సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1248 గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారని, ఈ రోజు రాత్రి మొత్తం కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వస్తూనే ఉంటాయని చెప్పారు. రేపు మధ్యాహ్నం వరకు దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తికావచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదని, పోలీసులు ప్రజలతో మంచి సంయవనం పాటిస్తూ గణేష్ విగ్రహాల ఊరేగింపు శాంతి భద్రతల మధ్య జరుగుతున్నదని అనురాగ్ శర్మ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 12 వేల సీసీ, వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఊరేగింపు జరుగుతున్న అన్ని ప్రాంతాలను పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జనోత్సవంలో అసాంఘీక శక్తులు కనబడితే చర్యలు తీసుకోవడంపై వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు. సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా 25 వేల మంది పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటున్నారని వీరితో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 13 కేంద్ర పోలీసు బలగాలు కూడా నిమజ్జనోత్సం సందర్భంగా శాంతి భద్రతల విధుల్లో పనిచేస్తున్నారని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. -
నిమజ్జనం చేద్దాం ఇలా..
జాగ్రత్తలు పాటిస్తే మేలు రేపు సామూహిక వినాయక నిమజ్జనోత్సవం సదాశివపేట: మండపాల్లో పదకొండు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఏకదంతుడికి గురువారంతో ఘనంగా వీడ్కోలు చెప్పనున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు సదాశివపేట ప్రాంతంలో ఘనంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో భక్తులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి పరవశిస్తున్నారు. వినాయక మండపాల వద్ద నిత్యం భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా పట్టణ పరిధిలోని మండపాల వద్ద సందడి సందడి నెలకొంటోంది. ఇక నిమజ్జన వేళ భక్తుల కొలహలం మిన్నంటనుంది. విఘ్నాలు తొలగించే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే విజయవంతంగా నిర్వహించుకోవచ్చు. పట్టణంలోని వివిద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 85 సామూహిక వినాయక విగ్రహాలను గురువారం మహేశ్వరి థియేటర్ సమీపంలోని మాడిచేట్టి రాచయ్య భావిలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలను అందరు పాటిస్తే ఎలాంటి అపశృతులు దోర్లకుండ ప్రశాంతంగా శాంతియుతంగా నిమజ్జనోత్సవం ముగుస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తలు పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలో ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు ముందుగా పూర్తి స్ధాయిలో సూచనలు సలహాలు ఇవ్వాలి. నిమజ్జనోత్సవాలకు ఒంటరిగా చిన్నారులను పంపించకూడదు. తోడుగాగాని కుటుంబ సభ్యుల్లో ఒకరు గానీ ఉంటే తప్ప పంపించకూడదు. సైడ్‌వాల్ లేని భవనాల చివరన నిల్చుని, కూర్చొని నిమజ్జన ఉత్సవాలను చూడవద్దు. విద్యుత్ తీగల విషయంలో... నిమజ్జన సమయంలో చాల వరకు విద్యుత్ తీగలు విద్యుత్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. వినాయక విగ్రహాలను ఊరేగించే విధుల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను కిందకు వేలాడకుండా పైకి ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలి. వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుద్ధీకరణ కోసం ఉపయోగించే విద్యుత్ వైర్లు నాణ్యమైనవి ఉండాలి. సెట్టింగ్‌లపై జాగ్రత్తలు వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో సెట్టింగ్‌ల పైభాగంలో విద్యుత్ తీగలు తగల కుండ జాగ్రత్తలు చూసుకోవాలి. సెట్టింగ్‌లు ఏర్పాటు చేసే సమయంలో వినాయకుని ప్రతీమ వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చెసే మెట్లు, స్టేజీలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. విద్యుద్ధీకరణ కోసం వాడే విద్యుత్ వైర్లు నాణ్యమైనవే ఉపయోగించాలి. విద్యుత్ తీగలు ఎక్కడ కూడ తెగిపోకుండా, జాయింట్లు లేకుండా చూసుకోవాలి. టపాకాయల వంటి వాటిని సెట్టింగ్‌ల సమీపంలో కాల్చకుండా చూసుకోవాలి. అగ్ని ప్రదాలకు అస్కారం ఉండే వాటిని దూరంగా ఉంచాలి. క్రమపద్దతిలో ఊరేగించాలి నిమజ్జన ఊరేగింపులో ఏలాంటి ఉద్వేగానికి లోనుకాకూడదు. సంవయమనం పాటించాలి. లాటరీ పద్దతిలో కేటాయించిన నంబర్ల ప్రకారమే వినాయకులను నిర్వహకులు క్రమపద్ధతిలో తరలించాలి. పోలీసులు, గణేష్ ఉత్సవ సమితి వారు మండపాల నిర్వహాకులు సూచించిన విధి విధానాలు పాటించాలి. కేటాంచిన నంబర్ల వినాయక విగ్రహాలను నిర్ణిత సమయంలో గాంధీ చౌక్ వద్దకు నిర్వహాకులు తీసుకురావాలి. నిమజ్జన సమయంలో... వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. వినాయక ప్రతిమలను మాడిచేట్టి రాచయ్య బావిలొ నిమజ్జనం చేయడానికి మున్సిపల్ అధికార యంత్రాంగం ప్రత్యేకమైన క్రేయిన్ తదితర ఏర్పాట్లు చేశారు. మండపాల నిర్వహాకులు నిమజ్జన సమయంలో చాల ఆప్రమత్తంగా ఉండాలి. నిమజ్జనోత్సవంలో నిర్వహాకులు శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి. ట్రాక్టర్‌పైన వినాయక విగ్రహాం వద్ద ఎక్కువ మంది ఉండకుండ చూసుకోవాలి. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం విగ్రహాలను నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చి నిమజ్జనం చేయాలి. -
నిమజ్జనోత్సవం
-
‘ధన’నాథులకు పూజలు
వినాయకచవితి మండపాలను నిర్వాహకులు పోటీ పడి లక్షల రూపాయల నగదుతో అలంకరిస్తున్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని మండపాన్ని రూ.27 లక్షల నగదుతో అలంకరించారు. పెదనందిపాడు మండలం కట్రపాడులోని పట్టాభిరామ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని రూ.10 లక్షల నగదుతో అలంకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకతోటి సుచరిత బుధవారం రాత్రి గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. – పెదనందిపాడు/ మంగళగిరి -
60 సెకన్లలో 12 విగ్రహాలు..
కరీంనగర్: ఎనిమిది సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన పీక మాద్విక(14) అనే చిన్నారి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. కరీంనగర్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పీక శశిధర్ కుమార్తె మాద్విక గతేడాది నవంబర్ 24న తన ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆన్లైన్లో ఆమె ప్రతిభను పరిశీలించిన ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆమెకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న మాద్విక గతంలోనూ పలు రికార్డులు సాధించింది. ఈ చిన్నారి గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా లిటిల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంది. -
సాగర్‌లో వినాయకుడు
-
సాగర్‌లో వినాయకుడు
నగరంలో ఒకప్పుడు తళతళ మెరిసిన హుస్సేన్‌సాగర్ ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. నిత్యం వచ్చి పడే చెత్తా చెదారానికి తోడు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వేలాది వినాయక విగ్రహాలు ఏటా సాగర్‌లో వచ్చి పడుతున్నాయి. బొజ్జగణపయ్యకు హంగులద్దిన కెమికల్ రంగులు స్వచ్ఛమైన నీటి రంగు మార్చేశాయి. మానవ తప్పిదాలన్నీ మన సాగరాన్ని మురికి తటాకంలా మార్చేస్తున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌ను కాపాడుతుంటారు కొందరు కార్మికులు. నిత్యం టన్నుల కొద్దీ చెత్తను వెలికి తీస్తున్నారు. నిమజ్జనం రోజు.. వేలాది విగ్రహాలను ఒంటి చేత్తో బయటకు తీస్తున్నారు. సాగర్ కంపులో చిక్కుకున్న గౌరీసుతుడ్ని కాపాడేందుకు వచ్చిన ప్రమధగణాలు వీళ్లు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లు లేకపోతే సాగర్ ఇంకెంత ఉప‘ద్రవం’గా మారిపోయేదో! తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సాగర్ ప్రక్షాళనకు నడుం బిగించినవారిలో కొందరిని ‘సిటీ ప్లస్’ తరఫున హీరో కృష్ణుడు ‘స్టార్ రిపోర్టర్’ రూపంలో పలకరించారు. - రిపోర్టర్ కృష్ణుడు కృష్ణుడు: రోజుకి ఎన్ని విగ్రహాలు పడతయి భయ్యా? రామచందర్: ఇన్నని ఏం చెబుతాం సార్. వేల విగ్రహాలు పడుతుంటాయి సార్. పోలీసులేమో 1,500 పెద్ద విగ్రహాలు అని చెప్తరు. కానీ వాటికి రెండు మూడు రెట్లు నిమజ్జనం అయితయి. చిన్నాపెద్దా విగ్రహాలు కలసి ఈ 11 రోజుల్లో ఓ ల క్ష వరకు పడతయి. కృష్ణుడు: విగ్రహాలను, మిగతా చెత్తను తొలగించడానికి ఎంత మంది పని చేస్తున్నారు ? నాగేష్: నిమజ్జనం టైం కదా సార్. వంద మందిమి ఉంటం. కృష్ణుడు: ఇప్పుడు రోజుకి ఎన్ని విగ్రహాలు బయటికి తీస్తున్నారు? రాజు: విగ్రహాలు, పత్రి, మిగతా చెత్త అంతా కలిపి పది నుంచి పదిహేను లారీల వరకూ ఉంటది. పెద్ద నిమజ్జనం రోజైతే దానికి డబుల్ ఉంటది. కృష్ణుడు: నిమజ్జనం చేసిన విగ్రహాల సంగతేంటి? రామచందర్: విగ్రహాలన్నీ తీసేస్తం. చిన్న విగ్రహాలను ఉన్నవున్నట్టు లారీలకెక్కిస్తం. పెద్దవయితే ముక్కలు చేసి తీస్తం. నాగేష్: ఖైరతాబాద్ వినాయకుడ్ని బయటికి తీసే సరికి మాకు చుక్కలు కనిపిస్తయ్! విగ్రహం లోపల పెట్టిన పీచు బాగా నానిపోతుంది. దాన్ని బయటకు తీసే సరికి చేతులన్నీ ఒరిసిపోతయి. కృష్ణుడు: విగ్రహాల సంగతి అటుంచండి.. మిగిలిన చెత్త ఎలా బయటకు తీస్తారు ? సాగర్: పదేళ్లుగా ఈ పనే చేస్తున్నం సార్. ఒకప్పుడు చెత్తని చేతులతో తీసేవాళ్లం. రెండేళ్ల కిందట క్లీన్ చేసే మిషన్లు వచ్చినయ్. పొక్లైన్లా ఉంటది. నీళ్ల నుంచి చెత్త తీసి ఒడ్డు వరకు తెస్తరు. దాన్ని మేం లారీల్లో లోడ్ చేస్తం. దగ్గర్లోని డంపింగ్ యార్డ్‌కు పంపిస్తరు. కృష్ణుడు: ఎంత మిషన్‌ని ఉపయోగించినా.. ఈ పని వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి కదా..! నాగేష్ : నిజమే సార్. ఎలర్జీలు వస్తయి. వానాకాలంలో అందులోనూ.. వర్షం బాగా వచ్చిన రోజుల్లో ఒకేసారి వందల టన్నుల చెత్త కొట్టుకొస్తది. అప్పటి వరకు నాలాల్లో ఉన్న చెత్తాచెదారమంతా బయటకు వస్తుంది. ఆ టైంలో మేం ముందూవెనుక చూడకుండా క్లీనింగ్‌లో మునిగిపోతం. పనికి తోడు కంపు. అప్పుడప్పుడు దవాఖానాకు పోతనే ఉంటం. రామచందర్: హుడావారి పుణ్యాన ఇప్పుడు కాస్త నయం. నాలుగైదేళ్ల కిందట ఇంకా దారుణంగా ఉండేది. ఏ రోజుకారోజు క్లీనింగ్ చేయవట్టి ఈ మాత్రమైనా ప్రశాంతంగా ఉంది. కృష్ణుడు: ఇంకా దుర్వాసన వస్తుంది క దా ! నాగేష్: అప్పటితో పోల్చుకుంటే ఇదెంత. రామచందర్: సిగరెట్ వాసన తాగేటోడికి రాదు, కానీ పీల్చేటోడికి వస్తది. అట్లనే మేం పొద్దంతా ఇక్కడే ఉండి పని చేస్తం కదా.. అందుకే మాకీ వాసన అంతగా అనిపించదు. కొత్తోళ్లు ఎవ్వరొచ్చినా ముక్కుకు బట్ట అడ్డం పెట్టుకుంటరు. కృష్ణుడు: భాగ్యనగరానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హుస్సేన్సాగర్కి వచ్చి ముక్కకు కర్చీఫ్ అడ్డం పెట్టుకునే పరిస్థితికి కారణం ఎవరంటారు? మనమే కదా! కెమికల్ కలర్స్ వాడిన విగ్రహాలు, చెత్తాచెదారం కారణంగా సాగర్ కలుషితమైపోతోందని నెత్తి, నోరు బాదుకున్నా.. ఎవరూ వినడం లేదు. రాజు: అవును సార్. వాటితో పాటు తెచ్చే పత్రి వల్ల నీరంతా పాడైతది. కృష్ణుడు: కొన్ని వేల ప్లాస్టిక్ కవర్లని ఇందులో వేస్తున్నారు. వాటివల్ల నీరు మరింత కలుషితమవుతుంది. నేను హైదరాబాద్ వచ్చి 30 ఏళ్లు దాటింది. అప్పట్లో హుస్సేన్‌సాగర్ చాలా బాగుండేది. రోజూ సాయంత్రం మా అమ్మానాన్నలతో వచ్చి సరదాగా గడిపేవాడ్ని. ఈ చెత్త, దుర్వాసన అప్పడు లేవు. మహేందర్: అవును సార్. అప్పట్లో ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉండేవి. మళ్లీ అలాంటి సాగర్ని చూడాలంటే చాలా కష్టం. కృష్ణుడు: ఆ సమస్యకు పరిష్కారంగా చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మార్పు మనలో రావాలి. ఈ సాగర్ మనది అనే ఫీలింగ్ వస్తే.. దీని శుభ్రత గురించి ఆలోచిస్తాం. మహేందర్: మన ఇంటిని ఎలా చూసుకుంటామో.. సాగర్ గురించి కూడా అట్లనే ఆలోచించాలి. వినాయకుడితో పాటు బస్తాలు బస్తాలు పత్రి వేస్తరు. దాన్ని పైననే ఉంచమంటే ఊకోరు. గొడవపడతారు. రామచందర్: చాలా మంది తాగొస్తరు. మర్యాదగా వద్దని చెప్పినా వినరు. ఒకసారి విగ్రహంతో పది బస్తల నిండా పత్రి పట్టుకొచ్చిండ్రు. దాన్ని పక్కన పెట్టమంటే కొట్టనీకి వచ్చిండ్రు. ‘నీదారా.. సాగర్’ అన్నరు. నాది కాకపోవచ్చు. కాని మనందరిదీ కదా సార్. కృష్ణుడు: అంతే కదా ఇది మనందరిదీ. సాగర్ సంక్షేమం గురించి, దీన్ని శుభ్రంగా ఉంచుతున్న మీ గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. సాగర్: నిమజ్జనం టైంలో ఉన్న శ్రద్ధ తర్వాత ఎవరికీ ఉండదు. ఈ పదకొండు రోజులైపోయినాంక అంతా మామూలే. కృష్ణుడు: సినిమాల్లోకి రాకముందు మేం ఇక్కడే బేగంపేటలో ఉండేవాళ్లం. నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సాయంత్రం, రాత్రి వేళల్లో సాగర్ అందాలు కెమెరాలో బంధించేవాడ్ని. ఓ 15 ఏళ్ల కిందట కూడా సాగర్ కొంత బాగానే ఉండేది. మట్టి విగ్రహాల సంఖ్య పెరిగితే పూర్వపు స్థితి మళ్లీ చూడొచ్చు. నాగేష్: అవును సార్. ఓ పది పెద్ద విగ్రహాలు కూడా మట్టితో చేసినవే వచ్చినయ్! వాటిని చూడంగనే మాకు ఆనందం అన్పించింది. చిన్న విగ్రహాలు రంగుల్లో ఉంటే ఇబ్బంది సార్. అవి నీళ్ల అడుగుభాగానికి చేరుకుంటయ్. తీయడం కష్టం. కృష్ణుడు: ఇప్పుడు చిన్న సైజు రంగుల విగ్రహాల సంఖ్య తగ్గుతోంది. ఈ విషయంలో స్కూలు యాజమాన్యాలకు థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలతో తయారుచేయించి మరీ పంచుతున్నారు. రామచందర్: ఈ సారి మట్టి విగ్రహాల సంఖ్య బాగా పెరిగింది. కృష్ణుడు: నాకింకో డౌట్.. సాగర్‌లో దూకి ఆత్మహత్యలు చేసుకునే వారి మాటేమిటి ? నాగేష్ : స్పాట్లో మేముంటే వెంటనే రక్షిస్తం. మొన్నీమధ్యనే టూరిజం శాఖవారు ఒకర్ని కాపాడారు. ఎవరూ చూడకపోతే.. దూకినోళ్ల ప్రాణాలు అంతే. శవాన్ని మేమే తీస్తం. వెంటనే అయితే ఫర్వాలేదు. ఒకోసారి నాలుగైదు రోజుల తర్వాత శవం దొరుకుతుంది. ఆ టైంలో మా తిప్పలు దేవుడికెరుక. సాగర్: మా కష్టం గురించి చెబితే ఎవరైనా అర్థం చేసుకుంటరు సార్. కాకపోతే మా విషయంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి. కృష్ణుడు: మీ డిమాండ్లు ఏంటి? రామచందర్: మాకు హెల్త్ కార్డులు కావాలి సార్. ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా డాక్టర్లు ముందు ఈ పని మానేయమంటున్నరు. నాగేష్: మా ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాలి. కృష్ణుడు: హైదరాబాద్ నడిబొడ్డున నిలువెత్తు బుద్ధుడి విగ్రహంతో కళకళలాడుతూ కనిపించే హుస్సేన్‌సాగర్, అందులోని నీళ్లు పరిశుభ్రంగా మార్చే ప్రయత్నం చేద్దాం. ఈ కార్మికుల జీవితాలు పచ్చగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్యూ వెరీమచ్. ఆపరేషన్ గణేశ సోమవారం ఒక్కరోజే నిమజ్జనం అయ్యే విగ్రహాల సంఖ్య: 35 వేలు ఇప్పటి వరకు నిమజ్జనం అయినవి : 16 వేలు (అధికారికంగా) ‘ఆపరేషన్ గణేష’కు అయ్యే వ్యయం: రూ.18.56 లక్షలు పాల్గొంటున్న కార్మికుల సంఖ్య: 200 మంది వినియోగిస్తున్నవి: 2 డీయూసీలు, 4 జేసీబీలు, ఒక పాంటోన్ ఎక్స్‌లేటర్, 20 టిప్పర్లు నిన్నటి వరకు తొలగించిన వ్యర్థాలు: 1,100 టన్నులు