గంటా అనుచరుడిపై వైఎస్ఆర్ సీపీ నేత ఫైర్ | karri seetharam takes on paruchuri bhaskar rao | Sakshi
Sakshi News home page

గంటా అనుచరుడిపై వైఎస్ఆర్ సీపీ నేత ఫైర్

Published Tue, Aug 9 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

karri seetharam takes on paruchuri bhaskar rao

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు పరిచూరి భాస్కర రావుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు కర్రి సీతారాం మంగళవారం విశాఖలో నిప్పులు చెరిగారు. మంత్రి గంటా లేకుండానే ఆయన తరఫున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని భాస్కర రావుపై మండిపడ్డారు. ఏ అర్హతతో అధికారులతో కలసి భాస్కరరావు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలు తలపెడుతున్నారని ప్రశ్నించారు. పరిచూరి భాస్కరరావుపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

సోమవారం భీమిలి నియోజకవర్గం పరిధిలో రూ. 83 లక్షల విలువైన పనులకు పరిచూరి భాస్కరరావు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో కర్రి సీతారాం పై విధంగా స్పందించారు. మంత్రి ఘంటా శ్రీనివాసరావు  భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా గంటా అనుచరునిగా షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారని పరిచూరి భాస్కరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement