గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ద్వారా రూ.24.39 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. గురువారం ఆలయంలో ఈఓతో పాటు ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు, పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయంలోని 24 హుండీలు లెక్కించారు. 37 రోజులకు సంబంధించి రూ.24,39,790 నగదుతో పాటు 3 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.14,828 నగదు అందిందని ఈఓ తెలిపారు.