చాపాడు: మైదుకూరులో రెండు రోజుల పాటు జరిగిన ’ఖేలో ఇండియా’ డివిజనల్ స్థాయి క్రీడా పోటీల్లో చాపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కబడ్డీలో పి.శశికళ, తులసి, భారతి, ఎస్. లక్ష్మీదేవి, వేదవాణి, జి.లక్ష్మిదేవి, ప్రత్యూష, మణిలు విన్నర్స్‌గా నిలిచారు. వీరితో పాటు లాంగ్‌జంప్, 100/200 మీటర్ల పరుగు పందెంలో పి.శశికళ ప్రథమ స్థానం, హైజంప్‌లో టి.సుప్రజ, జావెలిన్ త్రోలో జి.లక్ష్మీదేవి, వెయిట్ లిఫ్టింగ్‌లో ఆర్.గౌరిలు ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ రమాదేవి తెలిపారు. డివిజనల్ స్థాయి ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడం పట్ల కస్తూర్బా స్పెషలాఫీసర్ మల్లేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.