సొమ్ము మోదీది.. సోకు కేసీఆర్‌ది
మక్తల్ : కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తే కేసీఆర్ సోకు చేస్తున్నారని, సొమ్ము ప్రధానమంత్రి నరేంద్రమోదీది అయితే.. సోకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. బుధవారం మక్తల్ మండలంల పంచదేవ్‌పాడు దత్తక్షేత్రంలో పార్టీ మండల అధ్యక్షుడు హన్మంతు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆచారితోపాటు రాష్ర్ట నాయకులు కొండయ్య, శాంతికుమార్, నింగిరెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే రాష్ర్ట ప్రభుత్వం మేము చేశామని చెప్పుకోవడం ఎంత వరకు సమజసమన్నారు. కే సీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనులు తమ కమీషన్ల కోసమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2019లో తెలంగాణలో అధికారం చేపట్టాడానికి గ్రామాల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికూమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య మాట్లాడుతూ డీఎస్సీ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందువ మక్తల్‌లో ద్విచక్రవాహనాల ర్యాలీ తీశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అమరదీక్షిత్, విద్యాసాగర్, జిల్లా కార్యదర్శులు కె.నాగప్ప, రాజు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్‌జ సోమశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.