గుంటూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి చేరుకున్నారు. సూర్యాపేట నుంచి హెలికాఫ్టర్ లో బయలద్దేరిన కేసీఆర్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపి మాగంటి బాబు స్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ అక్కడ నుంచి మరో హెలికాఫ్టర్‌లో అమరావతికి చేరుకున్నారు. కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సిఎం మహమూద్ అలి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా వున్నారు. కేసీఆర్ గురువారం ఉదయం 10.15కి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి అమరావతి హెలికాప్టర్లో బయలుదేరిన సంగతి తెలిసిందే.