చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతాడు
చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతాడు
Published Fri, Aug 26 2016 7:52 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
యాదగిరిగుట్ట: రైతాంగ సమస్యను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో మహా ఒప్పందం చేసుకోవడం గొప్ప విషయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్ర«ధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మన నీళ్లను, నిధులను దోచుకున్న ఆంధ్రపార్టీలు నేడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహిత పై తమ్మిడిహట్టి, పెన్‌గంగపై చనాక– కొరాటా బ్యారేజీలు నిర్మించడంతో తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ అపర భగీర«థుడిగా చరిత్రలో నిలిచి పోతారన్నారు. జిల్లాలో ఉన్న ప్రతిపక్షాల నాయకులు ఆలేరు, భువనగిరి ప్రాంతాలను నీళ్లు రాకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటామని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ తిరిగితే ప్రజలే తిరుగుబాటు చేసి తరిమికొడతారన్నారు. ఈ సమావేశంలో కాటబత్తిని ఆంజనేయులు, గడ్డమీది రవీందర్‌గౌడ్, కాంటేకార్ పవన్‌కుమార్, ఉపేందర్‌నాయక్, వంగపల్లి అరుణ్‌కుమార్, శ్యాం తదితరులున్నారు.
Advertisement