19న కేరళ సీఎం విజయన్ కర్నూలు రాక
Published Sat, Jun 3 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు హాజరు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 19, 20, 21 తేదీల్లో కర్నూలులో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 27వ మహాసభలకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరుకానున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి టి.షడ్రక్ శనివారం ప్రకటనలో తెలిపారు. మహాసభల ప్రారంభ రోజైనా 19వ తేదీ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
నేడు ఆహ్వాన సంఘ సమావేశం
రాష్ట్ర మహాసభల విజయం కోసం ఆదివారం కార్మిక కర్షక భవన్‌లో ఆహ్వాన సంఘ సమావేశాని ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు షడ్రక్ తెలిపారు. ప్యాట్రన్స్, చీఫ్ ప్యాట్రన్స్, గౌరవ సభ్యులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement