కర్నూలు(లీగల్): జిల్లా జైలులో ఖైదీలకు అందించే భోజనం నాణ్యత లేదని, ములాకత్‌కు వచ్చే సందర్శల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి, మరికొంతమంది ఖైదీలు బుధవారం నిరాహారదీక్షలు చేస్తున్నట్లు తెలిసింది. వారు చేపట్టిన నిరాహారదీక్ష విషయం జిల్లా జైళ్ల అధికారి దృష్టికి వెళ్లిందని, సదరు విషయంపై విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం పోలీసు నిఘా వర్గాల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. జైలులో ఖైదీల నిరాహారదీక్ష చేపట్టిన విషయంపై సంబంధిత జైలు అధికారులను సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు.