హోరా హోరీగా ఖేలో ఇండియా
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రెండోరోజు జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు హోరా హోరీగా సాగాయి. స్థానిక నీలం సంజీవ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానాల్లో శుక్రవారం ఆర్చరీ, ఖోఖో, వాలీబాల్, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీల్లో వివిధ నియోజకవర్గాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రతి క్రీడలోనూ నాలుగు జట్లు ప్రాతినిధ్యం వహించాయి. క్రీడా ప్రాంగణమంతా క్రీడాకారుల సందడితో కోలాహలంగా మారింది. అండర్-14, 17 విభాగాలలో విజయానికి క్రీడాకారులు కఠోర శ్రమ చేయాల్సి వచ్చింది. ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్‌ను చూసేందుకు రోడ్డు వెంబడి వెళ్తున్న వారు ఎగబడటంతో కళాశాల వెలుపల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ పతకాలను, ట్రోఫీలను అందించారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.
రెండో రోజు విజేతలు
ఆర్చరీలో : అండర్-14లో బాలురు స్నేహిత్‌రెడ్డి, యశస్‌చంద్ర(అనంతపురం), జనార్ధన్(శింగనమల).., బాలికలు తీర్థ శ్రీవల్లి(అనంతపురం), లత(శింగనమల), మేఘన(రాప్తాడు).., అండర్-17లో బాలురు శ్రీశక్తి(అనంతపురం), శేఖర్(రాప్తాడు), భాస్కర్‌రెడ్డి(శింగనమల).., బాలికలు అఖిల, పరిమళ, యోగిత(శింగనమల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.
బాక్సింగ్‌లో : అండర్-14లో బాలురు 46 కేజీల విభాగంలో శ్రీను, చిన్నరాయుడు(అనంతపురం), వీరేష్(ఉరవకొండ).., 48 కేజీల్లో చంద్ర, నందకుమార్(అనంతపురం).., 50 కేజీల్లో రాహుల్(అనంతపురం), మహేష్‌బాబు(ఉరవకొండ).., 52 కేజీల్లో హర్షవర్ధన్(కదిరి), వేణుగోపాల్(ఉరవకొండ).., 54 కేజీల్లో దేవహర్ష(అనంతపురం), ఖలందర్(కదిరి) వరుసగా బహుమతులు సాధించారు. బాలికలు 46 కేజీల్లో హేమలత, కేశవి, లలిత(ఉరవకొండ).., 48 కేజీల్లో షాలిని, శ్వేత(ఉరవకొండ), 52 కేజీల్లో నందిని బాయి, జానుబాయి(ఉరవకొండ).., 54 కేజీల్లో కవిత(ఉరవకొండ) వరుస స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-17లో బాలురు 49 కేజీల్లో ఏజాజ్(కదిరి), శివ(అనంతపురం), రఘు(ఉరవకొండ).., 52 కేజీల్లో మహేష్(ఉరవకొండ), ఇర్ఫాన్(కదిరి), తన్వీర్(అనంతపురం).., 56 కేజీల్లో బాబాయునుస్(అనంతపురం), పరమేష్(ఉరవకొండ).., 60 కేజీల్లో హరికృష్ణ, శివకృష్ణ(అనంతపురం), నాగేంద్ర(ఉరవకొండ).., 64 కేజీల్లో రాకేష్(ఉరవకొండ), ఫయాజ్(అనంతపురం).., బాలికలు 48 కేజీల్లో షమీమ్(కదిరి), హేమా(శింగనమల), నందిని(ఉరవకొండ).., 51 కేజీల్లో శ్రావణి(శింగనమల), దివ్యశ్రీ (ఉరవకొండ), కిరణ్మయి(శింగనమల).., 54 కేజీల్లో గౌతమి, నిక్షిత(శింగనమల).., 57 కేజీల్లో సంఘవి(శింగనమల), సునీత(ఉరవకొండ).., 60 కేజీల్లో హర్షిణి(శింగనమల) బహుమతులు సాధించారు.
ఖోఖోలో : అండర్-14లో ఉరవకొండ, రాప్తాడు, రాయదుర్గం బాలుర జట్లు.., ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు బాలికల జట్లు.., అండర్-17లో ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం బాలుర జట్లు.., రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం బాలికల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
వాలీబాల్‌లో : అండర్-14లో రాప్తాడు, పెనుకొండ, కదిరి బాలుర జట్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి బాలికల జట్లు.., అండర్-17లో గుంతకలు, రాప్తాడు, శింగనమల బాలుర జట్లు, పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ బాలికల జట్లు వరుస స్థానాల్లో నిలిచాయి.