
కోల్‌బెల్ట్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పర్యటించారు. కార్మికుల సమస్యలపై కెటికె 5 ఇంక్లైన్‌లో ఆయన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భారతీయ జనత పార్టీ ముందుంటుందని చెప్పారు. కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని, వారసత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ విధానం లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నేతలు కూడా ఉన్నారు.