coal belt
-
‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల): మొన్నటి వరకు గప్‌చుప్‌గా ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా బొగ్గుబాయి బాట పడుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయా సంఘాల నేతలు గనులపై కవాతు చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనలు మొదలు పెట్టిన అన్ని సంఘాలు సెప్టెంబర్ నెలంతా కార్మికుల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. ప్రాతినిధ్య సంఘాలు ఆందోళన బాటపడుతుంటే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మాత్రం తాము సాధించిన హక్కులు, కల్పించిన సదుపాయాలను కార్మికులకు గుర్తుచేస్తోంది. (చదవండి: కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!) ఈ నెలంతా ఆందోళనలే.. గడిచిన రెండు నెలల నుంచి కార్మికుల డిమాండ్లపై ధర్నాలు, జీఎం కార్యాలయాల ఎదుట దీక్షలు చేసిన ప్రతిపక్ష సంఘాలు సెప్టెంబర్ నెలంతా మరింత ఉధృతంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. 10 శాతం హెచ్ఆర్ఏ, అన్‌ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ జాబ్, లాభాల్లో 35 శాతం వాటా వంటి డిమాండ్లపై ఏఐటీయూసీ ఇప్పటికే గనులపై నిరసనలు, జీఎం కార్యాలయాల ఎదుట పలుమార్లు దీక్షలు చేపట్టింది. సెప్టెంబర్ నెలలో సింగరేణి వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. కార్మికుల ప్రధాన సమస్యలు, గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతూ యాత్ర సాగుతుందని నాయకులు పేర్కొంటున్నారు. ఇక ఐఎన్టీయూసీ కార్మికుల 10 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి సింగరేణి వ్యాప్తంగా గనులపై మెమోరాండాల సమర్పణ, 8న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. మరో సంఘం హెచ్ఎమ్మెస్ ప్రధానంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తోపాటు ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి గనులపై గేట్ మీటింగులు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఎంఎస్ కూడా ప్రత్యేక ఉద్యమ కార్యచరణ చేపట్టింది. 16 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి ధర్నాలు , దీక్షలతో సంఘం నాయకులు కార్మికులకు మధ్యకు రాబోతున్నారు. సీఐటీయూ కూడా కార్మికుల డిమాండ్లపై ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తోంది. చేసింది చెప్పుకుంటే చాలని.. ప్రతిపక్ష సంఘాల ఉద్యమ బాటపడుతుంటే టీబీజీకేఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు చేసిన మేలు చెప్పుకుంటే సరిపోతుందనే భావనలో ఉన్నారు. కారుణ్య ఉద్యోగాలు, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపు, లాభాల్లో వాటా పెంచి ఇవ్వడం, ఇప్పటి వరకు సాధించిన హక్కులు, సదుపాయాలను గేట్ మీటింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలని ఆసంఘం నాయకులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీ ప్రకటించకముందే కార్మిక సంఘాలు సమరానికి సై అంటుండడం కొసమెరుపు. కార్మిక సంఘాల డిమాండ్లు.. పర్మినెంట్ పనిస్థలాల్లో ఔట్ సోర్సింగ్ ఆపివేయాలి. ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయాలి లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలి మారు పేర్లతో పనిచేసే వారిని క్రమబద్ధీకరించాలి సొంత ఇంటి పథకం అమలు చేయాలి అండర్ గ్రౌండ్లో అన్‌ఫిట్ అయి సర్ఫేస్‌లో ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, టెక్నీషియన్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి మున్సిపాలిటీ పరిధిలో 10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలి కంపెనీలో రాజకీయ ప్రమేయాన్ని నివారించి... నిధుల మళింపు ఆపాలి డిపెండెంట్ల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలి కొత్త బావులు తవ్వి కొత్త ఉద్యోగాలు కల్పించాలి -
బొగ్గు స్కాంలో మాజీ కార్యదర్శి దోషి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణంలో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను ఢిల్లీలోని ఓ కోర్టు దోషిగా నిర్ధారించింది. యూపీఏ హయాంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గుప్తాతోపాటు మరో ఐదుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు రిటైరయ్యారు. 2005–08 సంవత్సరాల మధ్య బొగ్గు శాఖ కార్యదర్శిగా ఉన్న గుప్తాకు బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన రెండు కేసుల్లో కలిపి ఇప్పటికే ఐదేళ్ల వరకు జైలుశిక్షలు పడ్డాయి. ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కోర్టు దోషులుగా ప్రకటించిన వారిలో కేఎస్ క్రోఫా అప్పట్లో బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండి, తర్వాత మేఘాలయ చీఫ్ సెక్రటరీగా రిటైరయ్యారు. మరో అధికారి కేసీ సమ్రియా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. శుక్రవారం విచారణ అనంతరం సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబర్ 3వ తేదీన కోర్టు వీరికి శిక్షలు ప్రకటించేదాకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. బొగ్గు బ్లాకుల కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ట్రయల్ కోర్టు 2015లో జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆయన పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమాచారాన్ని సీబీఐ లీక్ చేస్తోంది బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ గోప్యత పాటించడం లేదని స్పెషల్ జడ్జి ఓపీ సైనీ అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను సీబీఐ పట్టించుకోకుండా బయటి వ్యక్తులకు దర్యాప్తు సమాచారాన్ని చేరవేస్తోందని వ్యాఖ్యానించారు. కుంభకోణానికి సంబంధించిన పలు కీలక విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తేకుండా దాచి ఉంచిందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కోల్ బెల్టులో అన్నీ కోల్పోయామెందుకు?
♦ టీపీసీసీలో అంతర్మథనం... ♦ భవిష్యత్తు వ్యూహంపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులు, సంస్థ ప్రభావం ఉన్న 24 శాసనసభ నియోజ కవర్గాల్లో ఓటమికి కారణాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎన్నికలు జరిగిమూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో తెలంగాణ లో కాంగ్రెస్‌పార్టీ ఓటమికి కారణాలను నియోజకవర్గాలవారీగా లోతుగా అధ్యయనం చేయడానికి టీపీసీసీ కసరత్తును ప్రారంభిం చింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం పాతజిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు ఓడిపో యారు. ఓపెన్‌కాస్టులను బంద్చేయిస్తానని, కార్మికులకు ఇళ్లుఇస్తామని, వారసులకుఉద్యోగాలు, ఆదాయపుపన్ను మినహాయింపుకల్పిస్తామంటూ కేసీఆర్ చేసిన వాగ్దానాలను కార్మికులు నమ్మడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసినవారు నిర్ధారణకు వచ్చారు. 2014కు ముందు కాంగ్రెస్‌పార్టీకి ఉన్న బలం, గతఎన్నికల్లో ప్రజలు ఆదరించకపోవడానికి గల కారణా లను అధ్యయనం చేసి, బలం పెంచుకో వడానికి అనుసరించాల్సిన మార్గాలపై పార్టీ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వెంకట రమణారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. తెలంగాణ ఇచ్చిందనే సానుకూలత తోపాటు కాంగ్రెస్ తరఫున లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసినవారు సమర్థులే అయినా ఘోరపరాజయం పొందడానికి కారణాలను లోతుగా, నిర్దిష్టంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. రక్తసంబంధీకులూ టీఆర్ఎస్ వైపే... ‘నాతో రక్తసంబంధం ఉన్న చుట్టాలు కూడా టీఆర్ఎస్కే ఓటేశారు. వ్యక్తిగతంగా అప్పటి దాకా, ఆ తరువాత కూడా బంధువులతో మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు, సింగరేణికార్మికులకు వాళ్లు ఇచ్చిన హామీలను నమ్మా రు. దీనితో సింగరేణి కాలరీస్‌తో సంబంధ మున్నవారంతా టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఓట్లేశారు. అయితే, ఇప్పుడు అంతే తీవ్రంగా టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తిడుతున్నరు’అనిఒక అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి టీపీసీసీ ముఖ్యులతో జరిగిన సమా వేశంలో వెల్లడించారు. పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా చేసుకుని, క్షేత్రస్థాయిలో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలుంటా యని టీపీసీసీ అంచనా వేస్తోంది. సింగరేణి పరిధిలోని వామపక్ష కార్మికసంఘాలతో సహా మిగిలిన అన్ని టీఆర్ఎస్ యేతర కార్మిక సంఘాలతో కలసి క్షేత్రస్థాయిలో వాస్తవాలపై ప్రచారం చేయాలని, సింగరేణి మైనింగ్ మీ టింగులను పెట్టాలని టీపీసీసీ భావిస్తోంది. ఉపాధిహామీ కూలీలపైనా.. ఉపాధిహామీ కూలీలపైనా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. గ్రామాలవారీగా కూలీలతో సమావేశాలు నిర్వహించాలని టీపీపీసీ నిర్ణయించింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన ఉపాధిహామీ చట్టంతోనేఉపాధి పనులు జరుగుతున్నాయని, అయితే, చట్టంలోని హక్కులను కల్పించడం లేదని కార్మికులకు వివరించాలని నిర్ణయించింది. పనులు జరిగే ప్రాంతంలో టెంట్లు, తాగునీరు, చిన్న పిల్లలకు ఆలనాపాలన ఏర్పాట్లు,వేతనాలు 15 రోజులలోపు అందేవిధంగా కూలీలకు చైతన్యం కల్పించనుంది. -
కోల్‌బెల్ట్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పర్యటించారు. కార్మికుల సమస్యలపై కెటికె 5 ఇంక్లైన్లో ఆయన గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో భారతీయ జనత పార్టీ ముందుంటుందని చెప్పారు. కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని, వారసత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ విధానం లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు పార్టీ నేతలు కూడా ఉన్నారు. -
సూర్యా @50*
- 50 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత.. వేడిమి ధాటికి జనం విలవిల మణుగూరు: సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మంటలు పుట్టిస్తున్నాడు. రోహిణికార్తె ప్రవేశానికి 40 రోజుల మందే.. 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజల్ని విలవిలలాడిస్తున్నాడు. గడిచిన పదిరోజులుగా ఓక్కో డిగ్రీ పెరుగుతోన్న ఉష్ణోగ్రత బుధవారం 50 డిగ్రీల మార్కును చేరుకుంది. ఖమ్మంజిల్లా మణుగూరు పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అత్యధికంగా 50 డిగ్రీల ఎండ తీవ్రత నమోదయింది. కోల్‌బెల్ట్ కావటంతో సహజంగానే ఇక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఏప్రిల్‌లోనే 50 డిగ్రీలకు చేరుకోవటం అరుదు అని అధికారులు, స్థానికులు అంటున్నారు. ఎండకు తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో జనం ఇళ్లలోనుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో పలు పట్టణాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక రాజధాని హైదరాబాద్ లో మంగళవారం 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అటు ఏపీలోని పలు నగరాల్లోనూ పరిస్థితి నిప్పులవానను తలపిస్తున్నది. గుంటూరు జిల్లా రెంటచింతల, విశాఖపట్నం వాల్తేరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
హైకోర్టుకు సుధీర్ ఎన్కౌంటర్ కేసు
- పోలీసులపై కేసు పెట్టాలని హైకోర్టును - ఆశ్రయించిన తల్లి రెండేళ్ల తర్వాత కోల్‌బెల్ట్‌లో చర్చలు గోదావరిఖని : రెండేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మరణించిన కట్టెకోల సుధీర్(24) కేసు హైకోర్టుకు చేరింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని సుధీర్ తల్లి లక్ష్మి బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కో రారు. గోదావరిఖనిలో రౌడీషీటర్‌గా ముద్రపడిన కట్టెకోల సుధీర్(24) జూలై 10, 2012న ఎన్కౌంటర్లో మృతిచెందాడు. బాధితురాలు తన పిటిషన్లో ప్రతివాదులుగారాష్ట్ర హోం శాఖ ముఖ్య కా ర్యదర్శి, కరీంనగర్ జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ డెరైక్టర్, గోదావరిఖ ని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వోను చేర్చారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి న నివేదికను కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి.అఫ్జల్‌పుర్కర్ పోలీసు అధికారులను ఆదేశించారు. వచ్చే సోమవారం ఈ కేసుపై విచారణ సాగనుంది. ఆ రోజు ఏం జరిగింది? పోలీసుల కథనం మేరకు... గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీకి చెందిన కట్టెకోల సుధీర్(24) అదే ప్రాంతానికి చెందిన ఓ చికెన్‌సెంటర్ వ్యాపారిపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత తప్పించుకుని తిరిగాడు. అతని స్నేహితులు నీలపు వంశీ, దాసరి ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా... ఐడీపార్టీ పోలీసులను హతమార్చేందుకు సుధీర్ పథకం వే శాడని వారి ద్వారా తెలిసింది. వన్‌టౌన్ సీఐ ఎడ్ల మహేశ్, ఐడీపార్టీ పోలీ సులు గాలింపు ముమ్మరం చేశారు. జూన్ 10 తెల్లవారుజామున రామగుండం కార్పొరేషన్ వెనక ఉన్నాడనే సమాచారంతో అక్కడికి చేరుకుని.. సుధీర్‌ను లొంగిపోవాలని కోరగా.. అతని పోలీసులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా కా ల్పులు జరిపారు. కొంతసేపటికి అవతలివైపు నుంచి కాల్పులు ఆ గిపోవడంతో సీఐ వెళ్లి పరిశీలించగా సుధీర్ చెత్తకుప్పల్లో అచేతనంగా పడి ఉన్నాడు. తర్వాత ఏమైంది? పౌరహక్కుల సంఘం ప్రతనిధులు నిజనిర్దారణ చేపట్టారు. సంఘ టన ప్రాంతాన్ని పరిశీలించిన సభ్యులు ఎన్కౌంటర్ జరిగిన రోజు మేఘాలతో కూడిన వర్షం కురిసిందని, అమావాస్య కూడా కావడం తో ఆ ప్రాంతం చీకటిగా ఉందని గుర్తించారు. ఈ విషయాలన్నిం టిని క్రోడీకరిస్తూ సుధీర్ తల్లి లక్ష్మితో హైకోర్టులో పిటిషన్ వేయిం చారు. ఈ కేసును పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.రఘునాథ్ పిటిషనర్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించారు. -
తుక..తుక.
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : కోల్‌బెల్ట్ పరిధిలోని బొగ్గు గనులు తుకతుక మండుతున్నాయి. భానుడు రోజురోజుకూ తన ప్ర తాపం చూపుతుండడంతో మైన్స్‌లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చే యలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్‌బెల్ట్ ఏరియాల్లో 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత రానురాను మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు కొలిమై మండుతున్న కోల్‌బెల్ట్‌ను చూసి భయపడిపోతున్నారు. మొదటి బదిలీ విధులు ముగించుకొని వచ్చే కార్మికులు మధ్యాహ్నం రెండు గంటలకు గని నుంచి ఇంటికి బయలు దేరుతారు. అదే సమయానికి రెండో బదిలీకి వెళ్లే కార్మికులు సైతం ఇంటి నుంచి గనికి విధులకు వెళ్తారు. ఈ సమయంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింగరేణిలో 15 ఉపరితల, 34 భూగర్భ గనుల్లో 64 వేల మంది కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారు. రోజూ మొదటి, రెండో బదిలీ కార్మికులు 45 వేల మంది వరకు హాజరవుతుంటారు. ఇక్కడే ఉష్ణోగ్రత ఎందుకు ఎక్కువ.. బొగ్గు, దుమ్ము కార్మిక కాలనీల్లో విస్తరించడంతో పరిసర ప్రాంతాలు సాధారణ స్థాయిలో మించి ఉష్ణోగ్రత పెరుగుతుంది. బొగ్గు గనులు విస్తరించడం కోసం అడవులను నరికి వేశారు. దీనికి తోడు జనసాంద్రత పెరిగింది. బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపరితల గనుల్లో ఎండ వేడిమి సాధారణం కంటే అధికంగానే ఉంటుంది. పట్టణాల్లో ఉన్న వేడి కంటే గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లోనే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. బొగ్గు ఆక్సీకరణం చెందడంతోనూ ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా నమోదవుతూ ఉంటుంది. ఆక్సీకరణం చెంది మంటలు వ్యాపించిన సందర్భాలు ఉపరితల గనుల్లో ఇప్పటికే నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితి.. ఎండ వేడిని తట్టుకోలేక కార్మికుల హాజరు శాతం ఉపరితల గనుల్లో కొంత మేరకు తగ్గుతోంది. ఉదయం పది గంటల వరకే ఉష్ణోగ్రత 38 డి గ్రీలు నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 డిగ్రీలు దాటుతుండడంతో కార్మికులు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు సెలవులను వినియోగించుకుంటున్నారు. నివారణ చర్యలు చేపడుతున్నా.. ఉపరితల గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపరితల గనుల్లోని బొగ్గు పొరలు వేడెక్కకుండా ఉండేందుకు అధికారులు బొగ్గు బెంచీలను నీటితో నింపుతున్నారు. నీరు లభించని గనుల్లో బొగ్గు పొరలను మట్టితో కప్పేస్తున్నారు. ఉపరితల గనుల దారుల్లో స్పింకర్ల ద్వారా నీటిని సైతం చల్లిస్తున్నా వేడిమి మాత్రం తగ్గడం లేదు. సింగరేణి ఏం చేసింది.. భూగర్భ, ఉపరితల గనులతోపాటు సింగరేణి కాలనీల్లో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతను అడ్డుకునేందుకు యాజమాన్యం మొక్కలను నాటింది. గనులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో అవి విస్తారంగా పెరిగి చల్లని ప్రదేశాలుగా మారాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థ చేయని విధంగా 2002లో అటవీ శాఖను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1872.5 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల నీలగిరి, వెదురు, కానుగ తదితర మొక్కలను యాజమాన్యం నాటింది. కొత్తగూడెం ఏరియాలో 240, ఇల్లందు ఏరియాలో 115, మణుగూరు ఏరియాలో 40, ఆర్జి-1 ఏరియాలో 502.50, ఆర్జి-2 ఏరియాలో 115, ఆర్జి-3 ఏరియాలో 95, భూపాలపల్లి ఏరియాలో 260, శ్రీరాంపూర్ ఏరియాలో 215, బెల్లంపల్లి ఏరియాలో 205, మందమర్రి ఏరియాలో 85 ఎకరాల్లో సుమారు రెండు కోట్ల మొక్కలను నాటించింది. అయితే.. బొగ్గు నిక్షేపాలు పూర్తయిన గనుల వద్ద మరిన్ని మొక్కలను నాటి పెంచడానికి కృషి చేయాలి. ఇంకా పలు కాలనీల్లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుని మొక్కలు పెంచితే ఫలితం ఉంటుంది. -
నల్లసూరీళ్ల తెలం‘గానం’..
వారు నిత్యం చీకటి గుహల్లో పనిచేసే కార్మికులు.. ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పోరాడి సాధించుకునే పోరాట పటిమ వారిది.. ఇచ్చి న మాటకు కట్టుబడే తత్వం వారి సొంతం.. అలాంటి సింగరేణి కార్మికులు కట్టుబడినట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని అక్కున చేర్చుకున్నారు. నాలుగు జిల్లాల కోల్‌బెల్ట్ పరిధిలో అనూహ్య ఫలితాలు అందించి తమ ఐకమత్యాన్ని చాటారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించారు. కోల్‌బెల్ట్ పరిధిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 5 పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్కు నాలుగు పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ సీటు అప్పగించారు. కాంగ్రెస్, టీడీపీ ఒక్కో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నాయి. మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నా లుగు జిల్లాలోని సింగరేణి బొగ్గు గని కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పట్టం కట్టారు. కోల్‌బెల్ట్ లోని అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రధాన పార్టీల కంటే ముందంజలో ఉంది. మొదటిసారి కార్మికులు ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ చేతిలో పెట్టి ఆదరించారు. ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణ పోరులో రెండు స్థానాలు గెలుపొందడం విశేషం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికే పరిమిత మయ్యాయి. కమ్యూనిస్టులు మూడు ప్రాంతాల్లో పొత్తుతో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా వారిని కార్మికులు ఆదరించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు కూడా బెల్ట్‌లోనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీకి ఆదరణ.. కోల్బె ల్ట్ ప్రాంతాల్లో మొదటి సారిగా కార్మికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కకు తోసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు స్థానంలో పి.శ్రీనివాస్‌రెడ్డిని, పినపాక అసెంబ్లీ స్థానానికి పి.వెంకటేశ్వర్లును గెలిపించారు. ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్తుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో సైతం కౌన్సిలర్లను కార్మికులు ఆదరించారు. ఒంటరిగా బరిలోకి దిగి జాతీయ పార్టీల కంటే తామే గొప్ప అని ఈ పార్టీ నిరూపించింది. భవిష్యత్తులో సింగరేణిలో కీలక బాధ్యతలు వీరికి అప్పగించే అవకాశాలూ లేకపోలేదు. టీఆర్ఎస్ హవా.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటమంటూ కార్మికుల కాలనీలతోపాటు గనులపై టీఆర్ఎస్ మొదటి నుంచీ విసృ్తత ప్రచారం చేపట్టింది. సకల జనుల సమ్మెలో కార్మికులను నెల రోజులపాటు భాగస్వాములను చేసింది. ఎన్నికల హామీలో కార్మికులను ఆకట్టుకుంది. దీంతో కోల్‌బెల్ట్‌లోని ఐదు పార్లమెంటు, పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది. అందులో.. నాలుగు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కార్మికులు ఆ పార్టీని ఆదరించారు. మహబూబాబాద్‌లో సీతారాంనాయక్, వరంగల్‌లో కడియం శ్రీహరి, పెదపల్లిలో బాల్క సుమన్, ఆదిలాబాద్‌లో జి.నగేష్ పార్లమెంటు అభ్యర్థులుగా గెలుపొందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, మంచిర్యాలలో దివాకర్‌రావు, బెల్లంపల్లిలో చిన్నయ్య, చెన్నూర్‌లో ఓదెలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తెలుగుదేశం+బీజేపీకి నామమాత్రం.. తెలుగుదేశం, భారతీయ జన తా పార్టీలు పొత్తు పెట్టుకొని కోల్బె ల్ట్లోని అన్ని స్థానాలకు పోటీ పడ్డాయి. బీజేపీ ఒక ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా ఒక్కటి కూడా దక్కించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీచేయగా సత్తుపల్లి అసెంబ్లీని కాపాడుకోగలిగింది. కాంగ్రెస్+సీపీఐ.. ఒకటికే పరిమితం.. కాంగ్రెస్, సీపీఐలు జాతీయ పార్టీలు. వీటికి సింగరేణిలో కార్మిక అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని బలోపేతం చేయడంలో రెండు పార్టీలూ విఫలం కావడం నేటి ఫలితాలకు తార్కాణం. నిత్యం కార్మిక సమస్యలపై పోరాటం చేసే అనుబంధ సంఘాలు ఉన్నా కార్మికులను సార్వత్రిక ఎన్నికల్లో ఆకట్టుకోలేకపోయారు. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితాలు దక్కలేదు. పొత్తులో సీపీఐ మూడు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఎనిమిది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ పడగా ఇల్లందు అసెంబ్లీ స్థానం నుంచి కనకయ్య గెలుపొందారు. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ : వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నాయకు లు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీఎం నాగభూషణరెడ్డికి వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడు తూ జాతీయ సంఘాలు పోగొట్టిన వారస త్వ ఉద్యోగ హక్కును సాధించే వరకూ ఆందోళనలను విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో మండ సంపత్, మనోజ్‌కుమార్, బి.చందర్రావ్, ఎన్.రాజయ్య, నర్సింగరావ్, మహేందర్, మల్లేష్, కొడెపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.