హైకోర్టుకు సుధీర్ ఎన్‌కౌంటర్ కేసు
- పోలీసులపై కేసు పెట్టాలని హైకోర్టును
- ఆశ్రయించిన తల్లి రెండేళ్ల తర్వాత కోల్‌బెల్ట్‌లో చర్చలు
గోదావరిఖని : రెండేళ్ల క్రితం ఎన్‌కౌంటర్‌లో మరణించిన కట్టెకోల సుధీర్(24) కేసు హైకోర్టుకు చేరింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని సుధీర్ తల్లి లక్ష్మి బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కో రారు. గోదావరిఖనిలో రౌడీషీటర్‌గా ముద్రపడిన కట్టెకోల సుధీర్(24) జూలై 10, 2012న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. బాధితురాలు తన పిటిషన్‌లో ప్రతివాదులుగారాష్ట్ర హోం శాఖ ముఖ్య కా ర్యదర్శి, కరీంనగర్ జిల్లా ఎస్పీ, డీజీపీ, సీబీఐ డెరైక్టర్, గోదావరిఖ ని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వోను చేర్చారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి న నివేదికను కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి.అఫ్జల్‌పుర్కర్ పోలీసు అధికారులను ఆదేశించారు. వచ్చే సోమవారం ఈ కేసుపై విచారణ సాగనుంది.
ఆ రోజు ఏం జరిగింది?
పోలీసుల కథనం మేరకు... గోదావరిఖని పవర్‌హౌస్‌కాలనీకి చెందిన కట్టెకోల సుధీర్(24) అదే ప్రాంతానికి చెందిన ఓ చికెన్‌సెంటర్ వ్యాపారిపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత తప్పించుకుని తిరిగాడు. అతని స్నేహితులు నీలపు వంశీ, దాసరి ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా... ఐడీపార్టీ పోలీసులను హతమార్చేందుకు సుధీర్ పథకం వే శాడని వారి ద్వారా తెలిసింది. వన్‌టౌన్ సీఐ ఎడ్ల మహేశ్, ఐడీపార్టీ పోలీ సులు గాలింపు ముమ్మరం చేశారు. జూన్ 10 తెల్లవారుజామున రామగుండం కార్పొరేషన్ వెనక ఉన్నాడనే సమాచారంతో అక్కడికి చేరుకుని.. సుధీర్‌ను లొంగిపోవాలని కోరగా.. అతని పోలీసులపై నాటు తుపాకితో కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా కా ల్పులు జరిపారు. కొంతసేపటికి అవతలివైపు నుంచి కాల్పులు ఆ గిపోవడంతో సీఐ వెళ్లి పరిశీలించగా సుధీర్ చెత్తకుప్పల్లో అచేతనంగా పడి ఉన్నాడు.
తర్వాత ఏమైంది?
పౌరహక్కుల సంఘం ప్రతనిధులు నిజనిర్దారణ చేపట్టారు. సంఘ టన ప్రాంతాన్ని పరిశీలించిన సభ్యులు ఎన్‌కౌంటర్ జరిగిన రోజు మేఘాలతో కూడిన వర్షం కురిసిందని, అమావాస్య కూడా కావడం తో ఆ ప్రాంతం చీకటిగా ఉందని గుర్తించారు. ఈ విషయాలన్నిం టిని క్రోడీకరిస్తూ సుధీర్ తల్లి లక్ష్మితో హైకోర్టులో పిటిషన్ వేయిం చారు. ఈ కేసును పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.రఘునాథ్ పిటిషనర్ తరఫున న్యాయవాదిగా వ్యవహరించారు.