కోల్ బెల్టులో అన్నీ కోల్పోయామెందుకు?
♦ టీపీసీసీలో అంతర్మథనం...
♦ భవిష్యత్తు వ్యూహంపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులు, సంస్థ ప్రభావం ఉన్న 24 శాసనసభ నియోజ కవర్గాల్లో ఓటమికి కారణాలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎన్నికలు జరిగిమూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో తెలంగాణ లో కాంగ్రెస్‌పార్టీ ఓటమికి కారణాలను నియోజకవర్గాలవారీగా లోతుగా అధ్యయనం చేయడానికి టీపీసీసీ కసరత్తును ప్రారంభిం చింది.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం పాతజిల్లాల పరిధిలోని 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు ఓడిపో యారు. ఓపెన్‌కాస్టులను బంద్‌చేయిస్తానని, కార్మికులకు ఇళ్లుఇస్తామని, వారసులకుఉద్యోగాలు, ఆదాయపుపన్ను మినహాయింపుకల్పిస్తామంటూ కేసీఆర్ చేసిన వాగ్దానాలను కార్మికులు నమ్మడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసినవారు నిర్ధారణకు వచ్చారు.
2014కు ముందు కాంగ్రెస్‌పార్టీకి ఉన్న బలం, గతఎన్నికల్లో ప్రజలు ఆదరించకపోవడానికి గల కారణా లను అధ్యయనం చేసి, బలం పెంచుకో వడానికి అనుసరించాల్సిన మార్గాలపై పార్టీ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వెంకట రమణారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. తెలంగాణ ఇచ్చిందనే సానుకూలత తోపాటు కాంగ్రెస్ తరఫున లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసినవారు సమర్థులే అయినా ఘోరపరాజయం పొందడానికి కారణాలను లోతుగా, నిర్దిష్టంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది.
రక్తసంబంధీకులూ టీఆర్‌ఎస్ వైపే...
‘నాతో రక్తసంబంధం ఉన్న చుట్టాలు కూడా టీఆర్‌ఎస్‌కే ఓటేశారు. వ్యక్తిగతంగా అప్పటి దాకా, ఆ తరువాత కూడా బంధువులతో మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు, సింగరేణికార్మికులకు వాళ్లు ఇచ్చిన హామీలను నమ్మా రు. దీనితో సింగరేణి కాలరీస్‌తో సంబంధ మున్నవారంతా టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా ఓట్లేశారు. అయితే, ఇప్పుడు అంతే తీవ్రంగా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను తిడుతున్నరు’అనిఒక అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థి టీపీసీసీ ముఖ్యులతో జరిగిన సమా వేశంలో వెల్లడించారు.
పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా చేసుకుని, క్షేత్రస్థాయిలో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలుంటా యని టీపీసీసీ అంచనా వేస్తోంది. సింగరేణి పరిధిలోని వామపక్ష కార్మికసంఘాలతో సహా మిగిలిన అన్ని టీఆర్‌ఎస్ యేతర కార్మిక సంఘాలతో కలసి క్షేత్రస్థాయిలో వాస్తవాలపై ప్రచారం చేయాలని, సింగరేణి మైనింగ్ మీ టింగులను పెట్టాలని టీపీసీసీ భావిస్తోంది.
ఉపాధిహామీ కూలీలపైనా..
ఉపాధిహామీ కూలీలపైనా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. గ్రామాలవారీగా కూలీలతో సమావేశాలు నిర్వహించాలని టీపీపీసీ నిర్ణయించింది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన ఉపాధిహామీ చట్టంతోనేఉపాధి పనులు జరుగుతున్నాయని, అయితే, చట్టంలోని హక్కులను కల్పించడం లేదని కార్మికులకు వివరించాలని నిర్ణయించింది. పనులు జరిగే ప్రాంతంలో టెంట్లు, తాగునీరు, చిన్న పిల్లలకు ఆలనాపాలన ఏర్పాట్లు,వేతనాలు 15 రోజులలోపు అందేవిధంగా కూలీలకు చైతన్యం కల్పించనుంది.