2న పలు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు బంద్‌ | krishna water bandh on august 2nd | Sakshi
Sakshi News home page

2న పలు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు బంద్‌

Published Sat, Jul 30 2016 9:15 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

krishna water bandh on august 2nd

సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ రింగ్‌మెయిన్‌–1 పైపులైన్లకు నిర్వహణపరమైన మరమ్మతుల కారణంగా..ఆగస్టు 2న(మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి.. మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పలు ప్రాంతాలకు కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. బాలాపూర్, రాజీవ్‌ గృహకల్ప,అల్మాస్‌గూడా, ఏఆర్‌సీఐ, మైలార్‌దేవ్‌పల్లి, మదుబన్, పీడీపీ, రాజేంద్రనగర్, హైదర్‌గూడా, కిషన్‌భాగ్, సులేమాన్‌నగర్, నందిముసలాయ్‌గూడా, అత్తాపూర్, ఆళ్లబండ రిజర్వాయర్, రెడ్‌హిల్స్,సెక్రటేరియట్, మెహిదీపట్నం,

కాకతీయనగర్, విజయ్‌నగర్‌కాలనీ, మసాబ్‌ట్యాంక్, కార్వాన్, షేక్‌పేట్, టోలిచౌకి, లంగర్‌హౌజ్, ప్రశాసన్‌నగర్, జర్నలిస్ట్‌కాలనీ, ఫిల్‌్మనగర్, ఫిల్మ్నగర్‌ స్లమ్స్, రోడ్‌నెం.45, ఎస్పీఆర్‌హిల్స్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం, శ్రీరాంనగర్, కార్మికనగర్, లింగంపల్లి, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మాదాపూర్, లింగంపల్లి, హఫీజ్‌పేట్, చందానగర్, ఆర్‌సీపురం, మియాపూర్, కెపిహెచ్‌బి, ఇందు ప్రాజెక్ట్స్, మలేషియా టౌన్‌షిప్, బోరబండ రిజర్వాయర్, గాయత్రీనగర్, అల్లాపూర్, రామారావునగర్‌ ప్రాంతాలకు సరఫరా ఉండదని జలమండలి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement