పెరుగుతున్న కృష్ణా జలాలు
సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం వద్ద కృష్ణా జలాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వరద జలాలు భారీగా వస్తున్నాయి. దీంతో సంగమేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. శనివారం వీఐపీలకు కేటాయించిన శిబిరం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అధికారులు హుటాహుటిన ఈ శిబిరాన్ని తొలగించారు. భక్తుల అటువైపు వెళ్లకుండా బ్యారికేట్లు ఏర్పాటు చేశారు.